AP Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు – 5,000 పోస్టులు
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్ (ఆయా) పోస్టుల భర్తీకి ప్రభుత్వం దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ముఖ్యంగా 10వ తరగతి అర్హతతో, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ నియామకాలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ప్రకటన ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొదటి విడతలోనే 13 జిల్లాల్లో 2,645 పోస్టులు రాత పరీక్ష లేకుండా భర్తీ చేయబడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, మిగతా జిల్లాల్లో త్వరలో విడుదల కానున్నాయి.
పోస్టుల వివరాలు – ముఖ్య సమాచారం:
- సంస్థ పేరు:
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ శాఖ - పోస్ట్ పేరు:
అంగన్వాడీ హెల్పర్ (ఆయా) - మొత్తం ఖాళీలు:
5,000 పోస్టులు (సుమారు) - మొదటి విడత భర్తీ:
2,645 పోస్టులు - ఉద్యోగ స్థలం:
జిల్లా వారీగా - భర్తీ నిర్వహణ:
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు
విద్యార్హతలు:
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి
- అభ్యర్థి స్థానిక మహిళ అయి ఉండాలి
- వివాహిత మహిళలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది
వయోపరిమితి:
- 01 జూలై 2026 నాటికి 21 నుండి 35 సంవత్సరాలు
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు లేని సందర్భంలో కనీస వయస్సు 18 సంవత్సరాలు వరకు పరిగణించవచ్చు
జీతం వివరాలు:
- నెలకు సుమారు ₹7,000 వరకు వేతనం అందుతుంది
ఎంపిక విధానం:
- ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు
- ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది
మార్కుల విభజన:
- 10వ తరగతి మార్కులు – 50 మార్కులు
- శిక్షణ (ఫ్రీ స్కూల్ ట్రైనింగ్) – 5 మార్కులు
- వితంతువులకు – 5 నుండి 10 మార్కులు
- అనాధలకు – 5 మార్కులు
- వికలాంగులకు – 5 మార్కులు
- ఇంటర్వ్యూ – 20 మార్కులు
👉 తుది ఎంపిక జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది
ఎలా అప్లై చేసుకోవాలి?
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
- ఎక్కడ సమర్పించాలి: సంబంధిత జిల్లా ICDS కార్యాలయంలో

అవసరమైన పత్రాలు:
దరఖాస్తు సమయంలో క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:
- జన్మస్థల / నివాస ధృవీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- ఓటర్ ఐడి
- విద్యా సర్టిఫికేట్లు
- కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC)
- EWS సర్టిఫికేట్
- వికలాంగుల సర్టిఫికేట్ (అవసరమైతే)
All AP District Official Website – Click Here
Application PDF – Click Here
గమనిక:
రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న మహిళలు తమ జిల్లాలో విడుదలయ్యే నోటిఫికేషన్ను గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

