గుడ్ న్యూస్: ఏపీలో 1st క్లాస్ నుండి 10th క్లాస్ విద్యార్థులకు ఉచితంగా RTC బస్సు పాస్ లు ఇస్తున్నారు: పూర్తి వివరాలు

APSRTC Free Bus Pass For 1st to 10th Class Students :

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1st క్లాస్ నుండి 10th క్లాస్ విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ లో గాని లేదా డైరెక్ట్ బస్సు డిపో కి వెళ్లి బస్సు పాసులు తీసుకోవచ్చు. ఉచిత బస్సు పాస్ ఎలా పొందాలో పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

స్కూల్స్ జూన్ 12 వ తేదీ రీ ఓపెన్ చేసారు. విద్యార్థులకు స్కూల్ రావడానికి సమస్య అనేది ఉంటుంది అనే ఉద్దేశం తో ప్రభుత్వం జూన్ 13 వ తేదీన ఈ ఫ్రీ బస్సు పాస్ అనేది అమలు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఎవరి దగ్గర అయితే ఈ బస్సు పాస్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉచితం గా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

ఉచిత బస్సు పాసుల పంపిణీ ఎప్పటినుండి ప్రారంభం:

జూన్ 12, 2025 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా జూన్ 13వ తేదీ నుండి ఏపీఎస్ఆర్టీసీ స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ యొక్క ప్రయాణ వివరాలను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://buspassonline.apsrtconline.in/ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

బస్సు పాస్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్స్?:

1. విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్
2. విద్యార్థి పాస్ పోర్ట్ సైజు ఫోటో
3. విద్యార్థి స్కూల్ హెడ్ మాస్టర్ గారి సర్టిఫికెట్స్
4. విద్యార్థి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి సంతకం చేసిన అప్లికేషన్ ఫారం ఖచ్చితంగా బస్సు పాస్ కి జోడించాలి .

బస్సు పాస్ ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది?

ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలలు వెళ్లే విద్యార్థులందరికీ కూడా APSRTC Free Bus Pass For 1st class and 10th class స్టూడెంట్స్ అందరు కూడా బస్సు పాస్ పొందాలనుకున్నఅభ్యర్థులందరూ కూడా APSRTC డిపో వద్దకు వెళ్లి అక్కడ అకౌంట్ కౌంటర్ దగ్గర ఫారం ఇస్తారు. ఆ ఫారం తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గర సిగ్నేచర్ చేసి పైన తెలిపిన డాకుమెంట్స్ కూడా మీరు జమ చేసి డిపో లో ఫిల్ అప్ చేసి ఇచ్చినట్లయితే మీకు బస్సు పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన సమాచారం : 

1. ఇప్పటికే బస్సు ఉన్నవారు దానిని పునరుద్ధరించుకోవాలి లేదా కొత్తది తీసుకోవాలి.
2. ప్రతి ఒక్క విద్యార్థికి ఒకే ఒక్క ఫ్రీ పాస్ మాత్రమే మంజూరు అవుతుంది
3. విద్యార్థి ప్రయాణించే దూరాన్ని బట్టి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సరైన బస్సు పాస్ మంజూరు చేస్తారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply