నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల 2026

నవోదయ విద్యాలయాలలో (NVS ) 6వ తరగతి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల :

Navodaya Entrance Exams :

విద్యార్థులకు శుభవార్త … ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అడ్మిషన్ కోసం ప్రయత్నించవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026-27సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ JNVS ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 653నవోదయ విద్యాలయాలలో సీట్స్ భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రారంభం జూన్ 15 నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ముగింపు తేదీ 29 జులై 2025 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (JNVST) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, హాస్టల్, భోజనం వంటి సౌకర్యాలు అందజేయబడతాయి .

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 2025 జూన్ 15

దరఖాస్తు చివరి తేదీ: 2025 జులై 29

పరీక్ష తేదీలు:

ఫేజ్ 1: 2026 జనవరి 17

ఫేజ్ 2: 2026 ఏప్రిల్ 11.

కావాల్సిన అర్హతలు :

విద్యార్హత:

2025-26 విద్యా సంవత్సరంలో అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు

వయోపరిమితి: విద్యార్థులు 2014 మే 1 నుంచి 30 ఏప్రిల్ 2016 మధ్యలో జన్మించి ఉండాలి.

అవసరమైన పత్రాలు:

1. జన్మ ధ్రువీకరణ పత్రం

2. నివాస ధ్రువీకరణ పత్రం

3. విద్యా అర్హతను నిర్ధారించే సర్టిఫికెట్లు

దరఖాస్తు విధానం:

1.అధికారిక వెబ్‌సైట్ cbseitms.nic.in లేదా navodaya.gov.in కు వెళ్లండి.

2.”JNVST 2026-27 Class 6 Admission” లింక్‌పై క్లిక్ చేయండి.

3.”Registration” పై క్లిక్ చేసి ఫారమ్‌ను నింపండి.

4.అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించండి.

5.దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు కోసం ప్రింట్ తీసుకోండి

.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply