AP Anganwadi Poshan 2.0 Recruitment 2026 – రాత పరీక్ష లేకుండా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | వెంటనే అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడి పోషణ్ 2.0 ప్రాజెక్ట్‌లో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA) పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారిత కార్యాలయం ద్వారా ఈ నియామక ప్రక్రియ నిర్వహించబడుతుంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నందున ఉద్యోగార్థులకు ఇది మంచి అవకాశం.
పోస్టు వివరాలు
- డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA)
విద్యార్హతలు
అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
- మేనేజ్‌మెంట్ / సామాజిక శాస్త్రాలు / న్యూట్రిషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
- ఐటీ సామర్థ్య పెంపులో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం
- పర్యవేక్షణ నైపుణ్యాలు ఉండాలి
- స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు లిఖిత నైపుణ్యాలు
- ఆంగ్ల భాషలో మోస్తరు పరిజ్ఞానం
- బృందంగా పనిచేసే సామర్థ్యం మరియు విస్తృతంగా ప్రయాణించేందుకు సుముఖత
- స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది

వయోపరిమితి
- కనీస వయస్సు: 25 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
నెల జీతం
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వేతనం అందజేస్తారు.
అప్లికేషన్ ఫీజు
- ఈ నోటిఫికేషన్‌కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం
అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:
- విద్యార్హతల మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్
- అనంతరం ఇంటర్వ్యూ నిర్వహణ
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు
దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక జిల్లా వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫారం / CV ను పూర్తి చేసి, అవసరమైన ధృవపత్రాల జిరాక్స్ కాపీలను జత చేసి క్రింది చిరునామాకు సమర్పించాలి.
సమర్పించవలసిన చిరునామా:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి,
చాకిరాల మిట్ట, బరంపేట,
నరసరావుపేట, పల్నాడు జిల్లా – 522601
జత చేయవలసిన పత్రాలు
- విద్యార్హత సర్టిఫికేట్లు
- మార్కుల మెమోలు
- అనుభవ ధృవపత్రాలు
- కంప్యూటర్ సర్టిఫికేట్లు
- 10వ తరగతి చదువు ధృవపత్రాలు
- ఇతర అవసరమైన పత్రాలు
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11 మే 2026
- దరఖాస్తుల చివరి తేదీ: 18 మే 2026 సాయంత్రం 5:00 గంటల వరకు
Notification PDF – Click HereApplication PDF – Click Here
Official Website – Click Here
ముఖ్య గమనిక
అభ్యర్థులు కార్యాలయ పని దినాల్లో మాత్రమే దరఖాస్తులను సమర్పించాలి. చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు.

