Tirumala Tirupati Devasthanams Jobs 2026: రాత పరీక్ష లేకుండా టిటిడి హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు | TTD Hospitals Recruitment 2026

TTD Jobs 2026 notification banner for Civil Assistant Surgeon posts at Tirumala Tirupati Devasthanams hospitals with walk-in interview details
Tirumala Tirupati Devasthanams TTD Jobs 2026 – 08 Civil Assistant Surgeon posts | Contract basis | Walk-In Interview on 05 March 2026 at Central Hospital, Tirupati

Tirumala Tirupati Devasthanams Jobs 2026: రాత పరీక్ష లేకుండా టిటిడి హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు | TTD Hospitals Recruitment 2026

తిరుమల – తిరుపతిలోని టిటిడి ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. TTD Hospitals Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక చేసే అవకాశం ఇవ్వడం విశేషం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీన ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 పోస్టు వివరాలు

  • పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్

  • మొత్తం ఖాళీలు: 08

  • ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ (1 సంవత్సరం)

  • ఇంటర్వ్యూ స్థలం: సెంట్రల్ హాస్పిటల్, తిరుపతి

విద్యార్హతలు

  1. UGC గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

  2. రాష్ట్ర చట్టాల ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి.

  3. MD/MS వంటి PG అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

  4. అభ్యర్థులు తప్పనిసరిగా హిందూ మతాన్ని అనుసరించే వారు అయి ఉండాలి.

వయోపరిమితి

  • 01-02-2026 నాటికి గరిష్ట వయస్సు 56 సంవత్సరాల లోపు ఉండాలి.

 జీతం వివరాలు

  • నెలకు రూ. 53,495/- కాంట్రాక్ట్ వేతనం

  • చట్టబద్ధమైన తగ్గింపులు వర్తిస్తాయి

ఎంపిక విధానం (Selection Process)

ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది:

  • MBBSలో పొందిన మార్కులకు 80% వెయిటేజ్

  • ఇంటర్న్‌షిప్ అనంతరం ప్రతి ఏడాది అనుభవానికి 1 మార్కు (గరిష్టంగా 10 మార్కులు)

  • ప్రసిద్ధ ఆసుపత్రుల్లో అనుభవానికి 10% వెయిటేజ్

  • పై ప్రమాణాల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు

 ఎలా అప్లై చేయాలి?

  1. అధికారిక వెబ్‌సైట్ అయిన Tirumala Tirupati Devasthanams ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  2. పూర్తిగా నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లు తీసుకుని నిర్ణీత తేదీన సెంట్రల్ హాస్పిటల్, తిరుపతిలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

  3. తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించడం మంచిది.

  4. అవసరమైతే ఇంటర్వ్యూ షెడ్యూల్‌లో మార్పులు చేసే హక్కు సంస్థకు ఉంటుంది.

 ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 ఫిబ్రవరి 2026

  • వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 05 మార్చ్ 2026

రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ సంస్థలో వైద్య ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు చివరి తేదీ కోసం ఎదురుచూడకుండా ముందుగానే ఇంటర్వ్యూకు సిద్ధం కావడం మంచిది.

Notification PDF : Click Here

Application  PDF: Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Here

 

Leave a Reply