అగ్నిపథ్ పథకం కింద Agniveervayu Non-Combatant పోస్టుల భర్తీకి Indian Air Force అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా అభ్యర్థులను Hospitality మరియు Housekeeping స్ట్రీమ్స్‌లో 4 సంవత్సరాల సేవా కాలానికి ఎంపిక చేస్తారు. దేశ సేవతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకునే మంచి అవకాశం ఇది.
సంస్థ వివరాలు
-
సంస్థ పేరు: Indian Air Force
-
పోస్టు పేరు: Agniveervayu Non-Combatant
-
పథకం: Agnipath Scheme
-
Intake నంబర్: 02/2026
-
సేవా కాలం: 4 సంవత్సరాలు
స్ట్రీమ్స్ వివరాలు
ఈ నోటిఫికేషన్లో రెండు స్ట్రీమ్స్ ఉన్నాయి:
1️⃣ Hospitality Stream
2️⃣ Housekeeping Stream
ఎంపికైన అభ్యర్థులను సంస్థ అవసరాల ప్రకారం ఏ స్ట్రీమ్‌లోనైనా నియమించవచ్చు.
విద్యార్హత
-
10వ తరగతి (Matriculation) లేదా సమాన పరీక్ష
-
కేంద్ర / రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల గుర్తింపు పొందిన బోర్డు నుండి పూర్తి చేసి ఉండాలి
-
గుర్తింపు ఉన్న ఓపెన్ స్కూల్ కూడా అర్హమే
వయస్సు అర్హత (Age Criteria)
-
జన్మ తేదీ పరిధి: 02 జూలై 2005 నుంచి 02 జనవరి 2009 మధ్య
-
ఎన్రోల్మెంట్ సమయంలో గరిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
వివాహ స్థితి (Marital Status)
-
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు
-
4 సంవత్సరాల సేవా కాలంలో వివాహం చేసుకోరాదని లిఖితపూర్వక అంగీకారం ఇవ్వాలి
-
సేవా కాలంలో వివాహం చేస్తే 👉 తక్షణ సేవ రద్దు
-
భవిష్యత్తులో రెగ్యులర్ కేడర్ (NCs-E) ఎంపికకు కూడా అవివాహిత స్థితి తప్పనిసరి
మెడికల్ అర్హతలు
🔹 శారీరక ప్రమాణాలు
-
కనీస ఎత్తు: 152 సెం.మీ
-
ఛాతీ విస్తరణ: కనీసం 5 సెం.మీ
-
బరువు: ఎత్తు & వయస్సుకు అనుగుణంగా
🔹 చూపు (Vision)
-
ప్రతి కంటికి 6/36, సరిచేసిన తర్వాత 6/9
-
Colour Vision: CP-III
-
Refractive Error: ±3.5 D లోపే
-
PRK / LASIK చేసినవారు అర్హులు కాదు
🔹 వినికిడి (Hearing)
-
ప్రతి చెవితో విడిగా 6 మీటర్ల దూరం నుంచి ఫుసురు మాట వినగలగాలి
🔹 దంతాలు (Dental)
-
ఆరోగ్యకరమైన పళ్లతో కనీసం 14 dental points
-
Fixed / removable braces ఉన్నవారు అర్హులు కాదు
🔹 సాధారణ ఆరోగ్యం
-
తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదు
-
దేశంలో లేదా విదేశాల్లో పని చేయగల శారీరక & మానసిక సామర్థ్యం ఉండాలి
అనర్హత కారణాలు (Disqualification)
-
మత్తు పదార్థాలు / మద్యం వినియోగం
-
నిషేధిత డ్రగ్స్ (Zero Tolerance Policy)
-
నిబంధనలకు విరుద్ధమైన శాశ్వత టాటూలు
-
తీవ్రమైన వైద్య సమస్యలు
-
తప్పుడు సమాచారం / నకిలీ సర్టిఫికెట్లు
పని విధానం (Job Profile)
🔸 Hospitality Stream
-
వంట & కిచెన్ నిర్వహణ
-
ఆహార తయారీ, వడ్డింపు
-
పాత్రలు, కట్లరీ, ఫ్రిజ్ నిర్వహణ
-
పరిశుభ్రత & భద్రత ప్రమాణాల పాటింపు
🔸 Housekeeping Stream
-
గదులు, ఆఫీసులు, బాత్రూమ్లు శుభ్రం చేయడం
-
తోటల సంరక్షణ
-
బట్టలు ఉతకడం, ఇస్త్రీ
-
షూ పాలిష్, లెదర్ రిపేర్
-
కుట్టు, దర్జీ & ఇతర సహాయక పనులు
దరఖాస్తు విధానం (ముఖ్య గమనిక)
-
ఆన్లైన్ అప్లికేషన్ లేదు
-
అప్లికేషన్ ఫారమ్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి
అవసరమైన డాక్యుమెంట్స్‌తో సాధారణ పోస్టు లేదా డ్రాప్ బాక్స్ ద్వారా పంపాలి -
ఒక్క అభ్యర్థి – ఒక్క అప్లికేషన్ మాత్రమే
-
అసంపూర్తి / ఆలస్య దరఖాస్తులు స్వీకరించరు
🌐 అప్లికేషన్ వెబ్సైట్: https://agnipathvayu.cdac.in
అప్లికేషన్ పంపే కేంద్రాలు
-
దేశవ్యాప్తంగా ఉన్న Air Force Stations
-
అభ్యర్థులు ఒకే కేంద్రాన్ని మాత్రమే ఎంచుకోవాలి
-
ఒకటి కంటే ఎక్కువ కేంద్రాలకు పంపితే అప్లికేషన్ రద్దు
ముఖ్యమైన తేదీ
-
దరఖాస్తు చివరి తేదీ: 23 ఫిబ్రవరి 2026
ముఖ్య హెచ్చరిక
-
ఎంపిక పూర్తిగా మెరిట్ & అర్హతల ఆధారంగా
-
ఎలాంటి ఫీజు అవసరం లేదు
-
దళారులు / మధ్యవర్తులను నమ్మవద్దు
FAQs
Q: ఇది పర్మనెంట్ జాబా?
A: కాదు. ఇది 4 సంవత్సరాల Agnipath సేవ మాత్రమే.
Q: మహిళలు అప్లై చేయవచ్చా?
A: లేదు. ఈ నోటిఫికేషన్‌కు పురుషులు మాత్రమే అర్హులు.
Q: శిక్షణ ఉంటుందిా?
A: అవును. ప్రారంభంలో ట్రైనింగ్ ఉంటుంది.

