Tirumala Tirupati Devasthanams Jobs 2026: రాత పరీక్ష లేకుండా టిటిడి హాస్పిటల్స్లో ఉద్యోగాలు | TTD Hospitals Recruitment 2026
తిరుమల – తిరుపతిలోని టిటిడి ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. TTD Hospitals Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక చేసే అవకాశం ఇవ్వడం విశేషం.
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీన ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
పోస్టు వివరాలు
- పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్
- మొత్తం ఖాళీలు: 08
- ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ (1 సంవత్సరం)
- ఇంటర్వ్యూ స్థలం: సెంట్రల్ హాస్పిటల్, తిరుపతి
విద్యార్హతలు
- UGC గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- రాష్ట్ర చట్టాల ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి.
- MD/MS వంటి PG అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- అభ్యర్థులు తప్పనిసరిగా హిందూ మతాన్ని అనుసరించే వారు అయి ఉండాలి.
వయోపరిమితి
- 01-02-2026 నాటికి గరిష్ట వయస్సు 56 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం వివరాలు
- నెలకు రూ. 53,495/- కాంట్రాక్ట్ వేతనం
- చట్టబద్ధమైన తగ్గింపులు వర్తిస్తాయి
ఎంపిక విధానం (Selection Process)
ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది:
- MBBSలో పొందిన మార్కులకు 80% వెయిటేజ్
- ఇంటర్న్షిప్ అనంతరం ప్రతి ఏడాది అనుభవానికి 1 మార్కు (గరిష్టంగా 10 మార్కులు)
- ప్రసిద్ధ ఆసుపత్రుల్లో అనుభవానికి 10% వెయిటేజ్
- పై ప్రమాణాల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు
ఎలా అప్లై చేయాలి?
- అధికారిక వెబ్సైట్ అయిన Tirumala Tirupati Devasthanams ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- పూర్తిగా నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లు తీసుకుని నిర్ణీత తేదీన సెంట్రల్ హాస్పిటల్, తిరుపతిలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను తరచుగా సందర్శించడం మంచిది.
- అవసరమైతే ఇంటర్వ్యూ షెడ్యూల్లో మార్పులు చేసే హక్కు సంస్థకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 ఫిబ్రవరి 2026
- వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 05 మార్చ్ 2026
రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ సంస్థలో వైద్య ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు చివరి తేదీ కోసం ఎదురుచూడకుండా ముందుగానే ఇంటర్వ్యూకు సిద్ధం కావడం మంచిది.
Notification PDF : Click Here
Application PDF: Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Here

