TS TET 2025 Exams:
తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TS TET 2025) పరీక్షలు నిన్నటితో ప్రశాంతంగా ముగిశాయి. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారీగా ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూలై 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ టెట్ చైర్మన్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్ 2025 పరీక్షలు మొత్తం రెండు పేపర్లుగా నిర్వహించారు. రెండు పేపర్లకు కలిపి 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అబ్జెక్షన్ ఏవిధంగా పెట్టుకోవాలని అటువంటి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .
తెలంగాణ టెట్ ఆన్సర్ కీ విడుదల తేదీ? వాటి వివరాలు :
తెలంగాణ టెట్ 2025 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ ని జూలై 5వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు జూలై 5వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు అభ్యంతరాలు సబ్మిట్ చేసుకోవచ్చని తెలంగాణ టెట్ డైరెక్టర్ తెలిపారు. తెలంగాణ టెట్ ఫైనల్ ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం అందింది.
తెలంగాణ టెట్ ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల తేదీ : జూలై 5, 2025
తెలంగాణ టెట్ అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసే ఆఖరి తేదీ: జూలై 8, 2025
తెలంగాణ టెట్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ: జూలై 22, 2025.
తెలంగాణ టెట్ 2025 పరీక్షలకు ఎంతమంది హాజరయ్యారు?: పూర్తి వివరాలు :
పేపర్ 1:
దరఖాస్తు చేసుకున్న వారు : 63,261
పరీక్షకు హాజరైన వారు : 47,224
హాజరు శాతం: 74.65%
పేపర్ 2:
దరఖాస్తు చేసుకున్న వారు : 66,688
పరీక్షకు హాజరైన వారు : 48,998
హాజరు శాతం: 73.48%
రెండు పేపర్లకు (పేపర్ 1&2):
రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్నవారు : 53,706
పరీక్షలకు హాజరైన వారు : 41,207
హాజరు శాతం: 76.73%
ప్రాథమిక ఆన్సర్ కీ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ప్రాథమిక ఆన్సర్ కీ ని డౌన్లోడ్ క్రింది విధం గా చేసుకోండి.
1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” TS TET 2025 answer key download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. అభ్యర్థుల యొక్క ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది
4. ఆన్సర్ కిలో తప్పులు గమనించినట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోండి
5. అబ్జెక్షన్స్ కరెక్ట్ అయినట్లయితే మీకు ఒక మార్కు కేటాయిస్తారు.