TS SSC Hall Tickets 2026 Released | వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TS SSC Hall Tickets 2026
తెలంగాణ రాష్ట్రంలో TS SSC Hall Tickets 2026 అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్రంలో నిర్వహించబడనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పుడు తమ హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
తెలంగాణలో SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 14, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది.
ఈ హాల్ టికెట్లు Regular, Private, Vocational, OSSC Regular మరియు OSSC Private విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థులు తమ TS SSC Hall Ticket 2026 ను అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న WhatsApp సేవ ద్వారా కూడా హాల్ టికెట్ పొందే అవకాశం ఉంది.
అదనంగా, విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Headmaster) వద్ద నుండి కూడా హాల్ టికెట్ పొందవచ్చు.
WhatsApp ద్వారా TS SSC Hall Ticket 2026 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
విద్యార్థులు ఇప్పుడు WhatsApp ద్వారా కూడా తమ SSC హాల్ టికెట్ సులభంగా పొందవచ్చు. అందుకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
Step 1
ముందుగా మీ మొబైల్లో WhatsApp ఓపెన్ చేసి 8096958096 నెంబర్ ను సెర్చ్ చేయండి.
Step 2
అక్కడ MeeSeva Telangana అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి HI అని మెసేజ్ పంపండి.
Step 3
తర్వాత మెసేజ్‌లో
“SSC Hall Ticket March 2026” అని టైప్ చేసి పంపాలి.
Step 4
అప్పుడు SSC Hall Ticket Open Service అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 5
తరువాత Download SSC Hall Ticket – Start అనే ఆప్షన్ వస్తుంది. Start పై క్లిక్ చేయండి.
Step 6
ఇప్పుడు మీ District ను సెలెక్ట్ చేసి Continue పై క్లిక్ చేయాలి.
Step 7
ఆ తర్వాత మీ School Name చివరి 3 అక్షరాలు (Last 3 Letters) నమోదు చేయాలి.
Step 8
తరువాత స్కూల్ పేరు, విద్యార్థి పేరు, Date of Birth మరియు మీ Stream (Regular / Private / Vocational / OSSC Regular / OSSC Private) ఎంపిక చేయాలి.
Step 9
చివరగా Get Hall Ticket పై క్లిక్ చేస్తే మీ TS SSC Hall Ticket 2026 డౌన్లోడ్ అవుతుంది.
ముఖ్యమైన సూచన
SSC పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ తప్పనిసరి. కాబట్టి పరీక్షలకు ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి అందులో ఉన్న పేరు, పాఠశాల, పరీక్ష కేంద్రం వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి.
TS 10th Class Hall Ticket 2026 Released Direct Link: Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Here

