TS Inter Supplementary Results 2025 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల పై కీలక ప్రకటన

TS Inter Supplementary Results 2025:

తెలంగాణా ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ 2025 పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే . మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభమై చాలా రోజులు కావొస్తోంది. అయితే ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు రేపు లేదా ఎల్లుండి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారికంగా తెలుస్తోంది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకునే విధంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .

సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల ఎప్పుడు ఉండచ్చు?

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 9 లేదా 10వ తేదీన విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ తేదీలలో పరీక్ష ఫలితాలు విడుదల కానట్లయితే, జూన్ 15వ తేదీ నాటికి ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధం గా తెలుసుకోవచ్చు.

1.ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
2.వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana intermediate supplementary results 2025” ఆప్షన్ తో క్లిక్ చేయండి
3.విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4.వెంటనే స్క్రీన్ పైన రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం ఉంటుందా? లేదా?

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ పెట్టుకునే ఆప్షన్ కూడా బోర్డు వారు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించి వెబ్సైట్ ద్వారా గాని లేదా కళాశాల ద్వారా వెరిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply