TS EAMCET 2025 Seat Allotment:
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) అధికారులు తెలంగాణ ఎంసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 13, 2025న విడుదల చేయనున్నారు గతంలో విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ షెడ్యూల్లో స్పష్టంగా సీట్ అలాట్మెంట్ ఫలితాలకు సంబంధించిన తేదీని పేర్కొనడం జరిగింది. మొదటి విడత కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు, మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి సీట్ అలాట్మెంట్ ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సీట్ అలాట్మెంట్ ఫలితాలకు సంబంధించిన అధికారిక సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
TS EAMCET 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?: వాటి వివరాలు:
1. మొదటగా తెలంగాణ కౌన్సిలింగ్ నిర్వహించే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
2. ” Candidate login ” లేదా ” seat allotment results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్ధి యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేయండి
4. మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పూర్తి వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
5. వెంటనే సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS EAMCET 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాల విడుదల తేదీ మరియు సమయం ఎప్పుడు ఉండచ్చు?వాటి వివరాలు :
పరీక్ష పేరు: తెలంగాణ ఎంసెట్ 2025 (TS EAMCET 2025)
పరీక్ష నిర్వహించిన సంస్థ: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE)
సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేసే తేదీ : జూలై 13, 2025
ఫలితాలు విడుదలయ్యే సమయం : మధ్యాహ్నం 3:00 గంటలకు
ఫలితాలు చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ : https://tgeapcet.nic.in/
మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలను చెక్ చేసుకోండి.
సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం:
1. అల్లోట్ అయిన తర్వాత సీట్ ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి.
2. ట్యూషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి.
3. అల్లోట్ అయిన కళాశాల లేదా యూనివర్సిటీలో Report ఇవ్వాలి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి.
TS ఎంసెట్ 2025 తర్వాత ఎన్ని దశలు ఉన్నాయి? వాటికీ సంబందించిన వివరాలు:
జూలై 13: సీట్ Allotment ఫలితాలు విడుదల తేదీ
జూలై 13 – 17 వరకు : రిపోర్టింగ్ & ఫీజు చెల్లింపు తేదీ
జూలై 20: 2వ విడత షెడ్యూల్ విడుదలచేసే అవకాశం.