TS 10th Supplementary Results 2025 Release Date: Check Results @bse.telangana.gov.in

TS 10th Supplementary Exams Results 2025:

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించిన విషయం మీకు తెలిసిందే. ఇటీవల పూర్తి చేసిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల మూల్యాంకనాన్ని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ప్రారంభించారు. ఫలితాలను జూన్ మూడో వారం లేదా జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారుల నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఇంటర్ అడ్మిషన్స్ లో లేదా పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి త్వరగా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు తెలియజేసారు. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ? వాటి వివరాలు:

తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే గత సంవత్సరాల ఆధారంగా చెక్ చేసుకున్నట్లయితే, ఫలితాలను జూన్ మూడో వారం లేదా చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదల చేశాక విద్యార్థులు హై స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా గాని లేదా మీ మొబైల్ లో గాని ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ వచ్చేసి సబ్మిట్ చేయండి
4. వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
5. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply