TS 10th supplementary exams 2025:
తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షను జూన్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు, పరీక్ష పత్రాలు మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని దానికి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గత సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ మూడో వారం లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో జూన్ 27న సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. 2023లో అయితే జూలై 7న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం జూన్ నెల చివరి వారంలోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఫలితాలు ఎప్పుడు విడుదల కావచ్చు?
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ మూడో వారం లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్ష రాసింది చాలా తక్కువ మంది అభ్యర్థులైనప్పటికీ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాత ఈ నెలలోనే ఫలితాన్ని విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వెబ్సైట్లో ఫలితాలు ఎలా చూసుకోవాలి?: వాటి వివరాలు?
పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో రాసిన విద్యార్థులు ఈ క్రింది విధం గా రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు.
1. ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోం పేజీలో ” TS 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి.