TS 10వ తరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025:
తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపుగా 50,000 మంది వరకు విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ప్రస్తుతం తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు పరీక్ష పత్రాల మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఫలితాల విడుదలపై బోర్డు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు. దీంతో విద్యార్థులు పరీక్ష ఫలితాలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే గత సంవత్సరాల రికార్డులను ఆధారంగా చేసుకొని చూస్తే, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 4వ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
ఫలితాలను ఎప్పుడు విడుదల చేయచ్చు ?
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలకి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఫలితాలను జూన్ 4 వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ 24 నుండి 30వ తేదీల మధ్యన ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు వారి యొక్క మొబైల్ లోనే ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు. లేదా స్కూల్ హెడ్మాస్టర్ ని సంప్రదించి వారి ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధానం డౌన్లోడ్ చేసుకొండి.
TS ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్ల పరిశీలన వివరాలు
1. ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది
5. అది ప్రింట్ అవుట్ చేసుకొండి.