TS ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు 2025 Official Release Date:

TS Inter 1st Year & 2nd Year Results 2025 Official Release Date: Check Results @tgbie.cgg.gov.in

TS Inter Supplementary Results 2025:

తెలంగాణ ఇంటర్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఫలితాలను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు తెలిపారు. ఈ సప్లిమెంటరీ పరీక్షను మే 22 నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 894 సెంటర్లలో నాలుగు పాయింట్ రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ఇప్పుడు ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

అధికారికం గా ఫలితాలను విడుదల చేసే తేదీ? ఎప్పుడు?

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను జూన్ 16 మధ్యాహ్నం 12 గంటల తర్వాత విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు మీడియాకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఒక సెకండ్ లో చెక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు.

ఫలితాలను ఈ క్రింది విధం గా చెక్ చేసుకోండి?

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోం పేజ్ లో ” Telangana Inter 1st year and 2nd year supplementary exams 2025 results ” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
3. విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
4. వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
5. అది ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply