TG TET 2025 June Exams Results Date:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG TET 2025) జూన్ పరీక్షల ఫలితాలను జూలై 22, 2025 విడుదల చేయనున్నారు. ఈ పరీక్షను జూన్ 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ఆన్సర్ key , రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి జూలై 5వ తేదీన అధికారిక వెబ్ సైట్ లో లింక్ యాక్టివేట్ చేశారు. ఆన్సర్ కీ అండ్ రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు జూలై 8వ తేదీ వరకు అబ్జెక్షన్ పెట్టుకునే విధంగా అవకాశం కల్పించారు. చాలామంది అభ్యర్థులు వారి యొక్క రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకొని అందులో తప్పుగా ఉన్న ప్రశ్నలకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మరో 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సిద్ధం అయ్యారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
ఫలితాలు విడుదల ఎప్పుడు ఉండచ్చు? తేదీ? వాటి వివరాలు:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. మొత్తం 1.4లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులందరూ అదే రోజున ఫలితాలు డౌన్లోడ్ చేసుకొని వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?: డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి?
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది విధానాన్ని అనుసరించడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోం పేజ్ లో ” TG TET 2025 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
4. వెంటనే స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
5. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.