TG ICET 2025 Results:
తెలంగాణలో MBA/MCA కోర్సులో ప్రవేశాల కోసం ఇటీవల జూన్ 8, జూన్ 9 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్ 2025 పరీక్ష ఫలితాలను జూలై 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 75,932 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రోజు రెండు షిఫ్టుల వారిగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. . తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో వాటి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
TG ICET 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? వాటి వివరాలు:
తెలంగాణా ICET 2025 ఫలితాలను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1. ముందుగా తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోం పేజ్ లో ” TG ICET 2025 Results ” ఓపెన్ చేయండి
3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
5. అది ప్రింట్ అవుట్ తీసుకొని, సేవ్ చేసుకోండి.
పరీక్షలు నిర్వహించిన తేదీలు: వాటి వివరాలు:
జూన్ 8 & 9, 2025 తేదీలలో రోజుకి రెండు షిఫ్ట్ లవారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు.
మొత్తం అభ్యర్థులు ఎంత మంది హాజరు అయ్యారు? వాటి వివరాలు :
తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షలకు మొత్తం 75,932 మంది హాజరయ్యారు.
గత సంవత్సరం 2024 లో 77,942 మంది పరీక్షలకు హాజరయ్యారు.
మొత్తం హాజరు శాతం:
మొదటి రోజులో మొత్తం 90% మంది హాజరయ్యారు.
కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండచ్చు? వాటి సమాచారం :
తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలు విడుదల చేసిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ని అధికారులు విడుదల చేస్తారు. అయితే ఈ కౌన్సిలింగ్ ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి. సర్టిఫికెట్లు పరిశీలన చేసుకొని సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వచ్చు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.