తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పాలన అధికారి (GPO) ఉద్యోగాలు 2026 – పూర్తి అర్హత వివరాలు

తెలంగాణ రెవెన్యూ శాఖ GPO Jobs 2026 పోస్టర్ – 10,954 గ్రామ పాలన అధికారి ఖాళీలు, వయస్సు 18-34, 12వ తరగతి & డిగ్రీ అర్హత వివరాలు
Telangana Revenue Department GPO Jobs 2026 – 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు | అర్హత, వయోపరిమితి పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ (Services–II) శాఖలో గ్రామీణ పాలన అధికారి (GPO) పోస్టుల భర్తీకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. “గ్రామీణ పాలన అధికారి సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2026” ప్రకారం జి.ఓ.ఎం.ఎస్ నం.32 తేదీ 12-02-2026న అధికారికంగా ఆమోదం లభించింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

గ్రామ పరిపాలనను బలోపేతం చేయడం లక్ష్యంగా మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు సృష్టించబడ్డాయి. వీటిలో కొంతమంది మాజీ VRO/VRAలకు బదిలీ ద్వారా అవకాశం కల్పించగా, మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇప్పటికే సుమారు 5,000 పోస్టులు బదిలీల ద్వారా భర్తీ చేయబడ్డాయి. మిగిలిన 5,954 ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: తెలంగాణ రెవెన్యూ శాఖ
  • పోస్ట్ పేరు: గ్రామ పాలన అధికారి (GPO)
  • మొత్తం పోస్టులు: 10,954
  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలు: 5,954
  • ఉద్యోగ రకం: రెగ్యులర్ బేసిస్
  • అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్
  • అధికారిక వెబ్‌సైట్: https://ccla.telangana.gov.in/

విద్యా అర్హత

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం:

  • భారతదేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి.
    (కేంద్ర/రాష్ట్ర చట్టం లేదా UGC గుర్తింపు పొందిన సంస్థ)

బదిలీ ద్వారా నియామకానికి:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ
    లేదా
  • తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
  • సంబంధిత కేడర్‌లో కనీసం 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలి

 నెల జీతం

గ్రామ పాలన అధికారి (GPO) ఉద్యోగులకు సుమారు ₹34,000/- నుండి ₹40,000/- వరకు నెల జీతం ఇవ్వబడుతుంది.

వయోపరిమితి

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు
  • ప్రభుత్వం జారీ చేసే రూల్స్ ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

 ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ

 ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ccla.telangana.gov.in/ ద్వారా పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక

గ్రామ స్థాయిలో పాలనను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియ నిరుద్యోగులకు మంచి అవకాశం. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేయాలి.

Notification Pdf:  Click Here

Official Website:  Click Here

Join our WhatsApp Channel : Click Here

Leave a Reply