స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన Central Recruitment & Promotion Department (CRPD), ముంబై ద్వారా Circle Based Officer (CBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎంపికైన అభ్యర్థులు వారు అప్లై చేసిన సర్కిల్‌లోనే విధులు నిర్వర్తించాలి.
ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
| అప్లికేషన్ ప్రారంభం | 29 జనవరి 2026 |
| అప్లికేషన్ చివరి తేదీ | 18 ఫిబ్రవరి 2026 |
| కాల్ లెటర్ విడుదల | మార్చి 2026 |
| ఆన్‌లైన్ పరీక్ష | మార్చి 2026 (అంచనా) |
పోస్టుల వివరాలు
- పోస్ట్ పేరు: Circle Based Officer (CBO)
- కేడర్: Junior Management Grade Scale-I (JMGS-I)
- మొత్తం ఖాళీలు: 2050
- నియామకం: సర్కిల్ ఆధారంగా
- ప్రొబేషన్ పీరియడ్: 6 నెలలు
గమనిక: ఒక అభ్యర్థి ఒకే ఒక్క సర్కిల్‌కే అప్లై చేయాలి.
విద్యార్హత
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ
- Integrated Dual Degree, Engineering, Medical, CA, ICWA అర్హతలున్న అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు
అనుభవ అర్హత
- 31.12.2025 నాటికి కనీసం 2 సంవత్సరాల ఆఫీసర్ అనుభవం ఉండాలి
- అనుభవం Scheduled Commercial Bank లేదా Regional Rural Bank లో ఉండాలి
- SBI క్లరికల్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్హులు కారు
వయస్సు పరిమితి (31.12.2025 నాటికి)
- కనీస వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయస్సు సడలింపు
| వర్గం | సడలింపు |
| SC / ST | 5 సంవత్సరాలు |
| OBC (NCL) | 3 సంవత్సరాలు |
| PwBD (GEN) | 10 సంవత్సరాలు |
| PwBD (OBC) | 13 సంవత్సరాలు |
| PwBD (SC / ST) | 15 సంవత్సరాలు |
స్థానిక భాష అర్హత
- అప్లై చేసిన సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాష చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం రావాలి
- 10వ లేదా 12వ తరగతిలో ఆ భాష చదివినట్లయితే లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు
ఎంపిక విధానం (Selection Process)
-
ఆన్‌లైన్ పరీక్ష
Objective Test – 120 మార్కులు
| సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
| English Language | 30 | 30 | 30 నిమిషాలు |
| Banking Knowledge | 40 | 40 | 40 నిమిషాలు |
| General Awareness / Economy | 30 | 30 | 30 నిమిషాలు |
| Computer Aptitude | 20 | 20 | 20 నిమిషాలు |
Descriptive Test – 50 మార్కులు
Essay & Letter Writing (ఇంగ్లిష్‌లో)
-
స్క్రీనింగ్
- అభ్యర్థుల అనుభవం & జాబ్ ప్రొఫైల్ వెరిఫికేషన్
-
ఇంటర్వ్యూ
- మొత్తం మార్కులు: 50
4️. ఫైనల్ సెలక్షన్
- ఆన్‌లైన్ టెస్ట్ 75%
- ఇంటర్వ్యూ 25%
- సర్కిల్ & కేటగిరీ వారీగా మెరిట్ లిస్ట్
జీతం వివరాలు
- ప్రారంభ బేసిక్ పే: ₹48,480
- DA, HRA / Lease Rental, CCA, PF, NPS, Medical, LTC తదితర అలవెన్సులు వర్తిస్తాయి
అప్లికేషన్ ఫీజు
| కేటగిరీ | ఫీజు |
| General / OBC / EWS | ₹750 |
| SC / ST / PwBD | ఫీజు లేదు |
అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం
- Left Thumb Impression
- Handwritten Declaration
- ID ప్రూఫ్
- DOB ప్రూఫ్
- విద్యార్హత సర్టిఫికేట్లు
- అనుభవ సర్టిఫికేట్లు
- Resume
అప్లై చేసే విధానం
- SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- Careers → Current Openings క్లిక్ చేయండి
- CRPD/CBO/2025-26/18 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి
- ఫీజు చెల్లించి Submit చేయండి
ముఖ్య సూచనలు
- చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందే అప్లై చేయండి
- తప్పు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుంది
- అన్ని అప్డేట్స్ SBI అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంటాయి
FAQs
Q1: ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?
కాదు. కనీసం 2 సంవత్సరాల బ్యాంక్ అనుభవం తప్పనిసరి.
Q2: పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉందా?
లేదు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో నెగటివ్ మార్కింగ్ లేదు.
Q3: సర్కిల్ మార్చుకునే అవకాశం ఉందా?
లేదు. కనీసం 12 సంవత్సరాలు లేదా SMGS-IV వరకు మార్పు ఉండదు.
WhatsApp : Click Here

