Navy Civilian Recruitment 2025:
భారత నౌకాదళంలో 1110 గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (INCET-01/2025) ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. ఇండియన్ నేవీ INCET 01/2025 క్రింద వివిధ గ్రూప్ సి పోస్టుల కోసం 1110 ఛార్జ్ మ్యాన్ , డ్రాఫ్ట్ మ్యాన్ , ట్రేడ్స్ మ్యాన్ మేట్ & ఫైర్ మ్యాన్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడింది . ఒక సారి గమనించగలరు.
నేవీ జాబ్స్ కి సంబంధించి ముఖ్య మైన సమాచారం:
సంస్థ పేరు: ఇండియన్ నేవీ
మొత్తం జాబ్స్ : 1110
కావలసిన విద్యార్హతలు : సంబంధిత విభాగం లో 10th ,12th ,ITI డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి.
వయస్సు: 01. 01. 2026 నాటికీ 45 సంవత్సరాల లోపు ఉండాలి. కొన్ని పోస్టులకు 30 ఇయర్స్ వరకు అవకాశం ఉంది. 5 ఇయర్స్ వరకు SC /ST లకు, 3 ఇయర్స్ వరకు OBC వాళ్లకు వయస్సు లో సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు: నెలకు రూ 34,400/- నుంచి 1,12,400/- వరకు ఇస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), నైపుణ్య పరీక్ష ( పోస్టు ప్రకారం ), పత్ర దృవీకరణ , అండ్ వైద్య పరీక్ష ఆధారం గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: రూ 295 మహిళలు SC /ST దివ్యంగులు , EX సర్వీసు మెన్ కు ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
వెబ్సైటు :అర్హులైన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 5, 2025
దరఖాస్తు చివరి తేదీ: జూలై 18, 2025.
అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.