India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link 2025 Out , Result PDF Download

Postal GDS Results 2025 In Telugu for 21413 post :

పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిబ్రవరి 2025 విడుదలైన 21,413 పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 4th మెరిట్ లిస్ట్ 16 జూన్ 2025 విడుదల చేయడం జరిగింది. 10th అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా 2025 ఫిబ్రవరిలో అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ లో 4th మెరిట్ లిస్ట్ లో 229 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ 87.4 ఉంటుంది. తెలంగాణ లో 4th మెరిట్ లిస్ట్ లో 64 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ 95 ఉంటుంది. 01 జులై 2025 లోపల ఇచ్చిన డివిజన్ లో డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ నాలుగో మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి గడువులోగా హాజరయ్యే సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి. ఈ మెరిట్ లిస్టు కి సంబంధించిన పూర్తి సమాచారంక్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

పోస్టల్ GDS 4th మెరిట్ లిస్టు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 4th మెరిట్ లిస్టు ని ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

1. ముందుగా పోస్టల్ GDS వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” postal GDS online engagement schedule one January 2025 shortlisted candidates ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అక్కడ రాష్ట్రాలవారీగా 1st మెరిట్ లిస్టు నుండి 4th మెరిట్ లిస్ట్ వరకు షార్ట్ లిస్టు అయిన అభ్యర్థుల యొక్క జాబితా కి సంబంధించిన పిడిఎఫ్ లు ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకోండి .
4. ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ ID ద్వారా చెక్ చేసుకోండి.
5. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీరు ఉద్యోగానికి ఎంపిక చేసారు అని అర్థం.
6. ఆ రిజల్ట్ పిడిఎఫ్ లో ఇచ్చిన సర్టిఫికెట్ల గడువు తేదీలోగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరయ్యి సర్టిఫికెట్లను సబ్మిట్ చేయండి.

కావాల్సిన సర్టిఫికెట్స్ లిస్ట్ :

1.10 తరగతి marks లిస్ట్
2.కుల ధ్రువీకరణ పత్రం ( SC /ST /OBC )
3.పాసుపోర్టు .ఆధార్ కార్డు
4.PWD సర్టిఫికెట్ ( వికలాంగ అభ్యర్థులకు )
5.లింగ మార్పిడి సర్టిఫికెట్స్ ( తరలింపు అభ్యర్థులకు )
6.పుట్టిన తేదీ రుజువు
7.EWS సిర్టిఫికెట్ ( ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు & ప్రభుత్వ విద్యాధికారి జారీ చేసిన వైద్య ధ్రువీకరణ పత్రం అన్ని సంబంధిత డాకుమెంట్స్ ఒరిజినల్ మరియు 2 సెట్స్ సెల్ఫ్ అట్టేస్ట్రేడ్ ఫోటో కాపీ లతో పటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply