CBSE 10th Class ,12th Class Results 2025| CBSE ఫలితాలు విడుదల విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ ఫలితాలకు డేట్ ఫిక్స్ … !

CBSE 10th Class ,12th Class Results 2025:
సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) నిర్వహించే 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం దేశ వ్యాప్తం గా లక్షలాది మంది విద్యార్థులు వేచి చూస్తున్నారు . ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగాయి, ఇప్పుడు విద్యార్థులు మరియు తల్లి తండ్రుల్లో ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఎదురుచూస్తున్నారు
CBSE 10th class , 12th class ఫలితాల పై విడుదల పైన అంచనాలు :
గత సంవత్సరాల ఫలితాల విడుదల తేదీ లను పరిశీలిస్తే 2023 మే 12 న ,2024 మే 13న ఫలితాలు విడుదల అయినాయి. అందువల్ల ఈ సంవత్సరం 2025 మే రెండవ వారం లో అంటే మే 12 నుంచి 15 మధ్యలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అధికారికంగా తేదీ ప్రకటించబడిన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఎక్కడ చూడచ్చు?
CBSEఫలితాలు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి,విద్యార్థులు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ లలో ఫలితాలు చూసుకోవచ్చు.
https://www.cbse.gov.in/
https://results.cbse.nic.in/
https://results.digilocker.gov.in/
https://web.umang.gov.in/landing
https://results.eenadu.net/
ఫలితాలు విడుదల ఐన వెంటనే విద్యార్థులు పైన ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా తమ రిజల్ట్స్ ని చూసుకోవచ్చు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి:
విద్యార్థులు తాము సాధించిన మార్కులను తెలుసుకోవడం చాల సులభం. ఈ క్రింది స్టెప్స్ ని పాటించండి.
1.ముందుగా CBSE అధికారిక వెబ్సైటు https://results.cbse.nic.in/ ని ఓపెన్ చేయండి.
2.class 10th లేదా class 12th results 2025 అనే లింక్ పైన క్లిక్ చేయండి.
3. అక్కడ మీ రోల్ నెంబర్,పుట్టిన తేదీ మరియు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
4.అందిన వివరాలతో సుబిట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
5.వాటిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొండి.
అధికారిక సమాచారం కోసం ఎప్పటికెప్పుడు CBSE వెబ్సైటు ను పరిశీలిస్తూ ఉండండి.