AP Nirudhyoga Bruthi Scheme 2025:
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. 2024 ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి అయిన నిరుద్యోగ భృతి పథకాన్ని (AP Nirudhyoga Bruthi Scheme 2025) ఈ సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఉండడంతో, ఈ ఆర్థిక సహాయం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అయితే నిరుద్యోగ భృతికి ఉండవలసిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
నిరుద్యోగ భృతి పథకం యొక్క ముఖ్య సమాచారం :
పథకం పేరు : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2025
ప్రయోజనం : నెలకు 3000/- రూపాయలు ఎకౌంట్లో జమ
ఎలాంటి వారు లబ్ధిదారులు ?: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులుగా నమోదైన వారు
ఈ పథకం అమలు చేసే ప్రభుత్వ శాఖ : కార్మిక శాఖ, విద్యాశాఖ మరియు APSSDC సంయుక్తంగా అమలు చేయనుంది.
పథకం ప్రారంభ తేదీ: మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విధంగా, 2025 సంవత్సరంలోపే ఈ పథకం ప్రారంభమవుతుంది అని అధికారికంగా ప్రకటన తెలియజేసారు.
నిరుద్యోగ భృతి పథకానికి కావలసిన అర్హతలు :
1. అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
2. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు వయసు ఉండాలి.
3. అభ్యర్థి తప్పనిసరిగా తక్కువలో తక్కువగా పదో తరగతి /ఇంటర్మీడియట్ /డిప్లమా/ ఐటిఐ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
4. అభ్యర్థి ప్రభుత్వా లేదా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
5. ఇతర ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వ పథకాలు నుండి రాయితీ పొందుతూ ఉండకూడదు .
నిరుద్యోగ భృతి పథకానికి కావలసిన సర్టిఫికెట్లు:
1. నిరుద్యోగి యొక్క ఆధార్ కార్డ్
2. పదో తరగతి మార్క్స్ లిస్ట్ ఆధారంగా వయస్సు ధృవీకరణ పత్రం
3. విద్యార్హతల సర్టిఫికెట్లు
4. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫీసులో నిరుద్యోగి రిజిస్ట్రేషన్ ఐడి ( employment exchange ID)
5. మీసేవ నుండి పొందిన నివాస ధ్రువీకరణ పత్రం. లేదా రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఏ విధం గా అప్లై చేసుకోవాలి?
1. APSSDC లేదా మీసేవ అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి.
2. ” Unemployment Allowance” లేదా నిరుద్యోగ భృతి పథకం అనే సెక్షన్ లోనికి వెళ్ళండి.
3. ఆధార్, విద్యార్హతలు, ఎంప్లాయిమెంట్ ఐడి వంటి వివరాలన్నీ పూర్తి చేయండి.
4. అవసరమైన డాక్యుమెంట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయండి.
5. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది నోట్ చేసుకోండి.
6. మీరు దాన్ని ఫ్యూచర్ ట్రాకింగ్ కోసం సేవ్ చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు.భవిష్యత్తులో ప్రారంభమైనప్పుడు ఈ క్రింది విధంగా అప్లై చేసుకోవాలి.