10,000 Jobs In APSRTC Free Buses :
ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలలో భాగం గా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి గాను 2 వేల వరకు బస్సులు అనేవి కొత్తగా అవసరం పడతాయి. వీటికి అదనం గా 10 వేల మంది సిబ్బంది ని కూడా నియమించాలని APSRTC అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సెస్ పాటు కొత్త నియామకాలు ఖచ్చితంగా చేపడుతామని హామీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉండటం వల్ల చాల ఇబ్బందులు పేస్ చేస్తున్న RTC ఖచ్చితంగా 10000 వరకు పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇస్తోంది.
ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలు ఉంటాయి. వీటికి 10వ తరగతి అర్హత ఉంటె చాలు. డ్రైవర్ ఉద్యోగాలకు మాత్రం ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి డ్రైవింగ్ చేయడం వచ్చి ఉండాలి. కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం మీకు ఎటువంటి ఎక్సపీరిన్స్ అవసరం లేదు. వీటికి జీతాలు కూడా 25 వేల నుంచి 35 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.