APPSC Jobs : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల

APPSC Jobs : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల

Telugu Jobs Guide :

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 2024 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం ఉద్యోగాలు 37 ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేస్తున్నారు.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం జూన్ 02 నుంచి 04 వ తేదీన రిక్రూట్మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి.

పరీక్షా నిర్వహణ ఎలా ?

APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు రాత పరీక్ష జూన్ 2 నుంచి 4 వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలను ఆఫ్ లైన్ లో OMR విధానం లో నిర్వహిస్తున్నారు.

జూన్ 2వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 4.10 వరకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు లో క్వాలిఫైయింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

జూన్ 3 వ తేదీన జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షజరుగుతుంది.

జూన్ 3 వ తేదీ మధాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 మాథెమాటిక్స్ పరీక్ష ఉంటుంది.

జూన్ 4 వ తేదీ ఉదయం సెషన్ లో పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 1 పరీక్ష ఉంటుంది.

జూన్ 4 వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు పేపర్ 4 జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్స్ APPSC వెబ్సైటు లో అందుబాటులో ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply