AP Talliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈ పథకాల కోసం ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం తప్పనిసరిగా చేయాలని సూచించారు.. ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకానికి ఆధార్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ (అనుసంధానం) చేసుకోవాలని సూచించారు.
క్రింద తెలిపిన 2 ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చేయాలి
1. ఆధార్ బ్యాంకు అకౌంట్ తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలి.
2. నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCI) తో లింక్ కూడా తప్పనిసరిగా చేయాలి.
పైన తెలిపిన 2 పాయింట్స్ తప్పనిసరిగా చేయాలి లేకపోతే తల్లికి వందనం పథకం కింద మనకు డబ్బులు 15000/- అకౌంట్ లో పడదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు . ఒక సరి గమనించగలరు
.