AP SSC సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 : Check Results @bse.ap.gov.in/

AP SSC Supplementary results 2025 :

ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు అనగా జూన్ 12 వ తేదీ 2025 విద్యాశాఖ అధికారులు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు   10 వ తరగతి పరీక్షలు రాయగా 4,98,585 మంది ఉతీర్ణులు అయ్యారు. 81. 14% శాతం ఉతీర్ణత సాధించారు. అలాగే ఫెయిల్ ఐన విద్యార్థులు 1,15,874 మంది ఉన్నారు. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1. ముందుగా ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారి వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోమ్ పేజీలో “AP SSC Supplementary Exams 2025 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
5. వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోండి.

ssc ఫలితాలు మొబైల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం

వాట్సాప్ ద్వారా ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

ఏపీ SSC పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.

1.ముందుగా విద్యార్ధి యొక్క మొబైల్ ఫోన్ లో ఈ వాట్సాప్ నంబర్ +9195523 00009 ని సేవ్ చేసుకోండి.
2. ఏపీ మనమిత్రవాట్సాప్ కు ‘ HI’ అని మెసేజ్ పెట్టండి.
3. ‘సేవలు ఎంచుకోండి” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి.
5. “AP 10th Supplementary Exams” Results ఆప్షన్ని సెలెక్ట్ చేయండి                                                                                                                                                              6. విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ లేదా డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
7. వెంటనే ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి.

పైన తెలిపిన విధంగా అధికారిక వెబ్సైట్ ద్వారా, అలాగే వాట్స్అప్ ద్వారా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply