త్వరలో 10,060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 – AP Job Calendar 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు త్వరలోనే ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అదే విధంగా AP Job Calendar 2026 విడుదలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి, వాటి ఆధారంగా సుమారు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అన్ని శాఖలలో ఉన్న ఖాళీలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలించినట్లు సమాచారం.
విభాగాల వారీగా అంచనా ఖాళీలు
- విద్యాశాఖ & ఇంటర్మీడియట్ విద్యాశాఖ – 3000 పోస్టులు
- విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 1500 పోస్టులు
- పోలీస్ శాఖ (SI & కానిస్టేబుల్) – 3000 పోస్టులు
- Assistant Engineer (AE) పోస్టులు – 500 పోస్టులు
- సంక్షేమ వసతి గృహ వార్డెన్లు – 200 పోస్టులు
- అటవీ శాఖలో ఉద్యోగాలు – 100 పోస్టులు
- గ్రూప్–1 పోస్టులు – 100 పోస్టులు
- గ్రూప్–2 పోస్టులు – 500 పోస్టులు
- స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టులు – 200 పోస్టులు
ఈ ఖాళీల ఆధారంగా మొత్తం సుమారు 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అయితే, AP Job Calendar 2026లో తుది ఖాళీల సంఖ్య మరియు విభాగాల వారీ పూర్తి వివరాలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
AP JOB CALENDAR ALL DETAILS: CLICK HERE
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Here

