AP Inter Results 2025 / AP 1st year and 2nd year results 2025

AP Inter Results 2025:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 1st ప్రారంభం అయినాయి . 2 వ సంవత్సరం పరీక్షలు మార్చ్ 3వ తేదీ న ప్రారంభం అయినాయి . 1st ఇయర్ పరీక్షలను 19th మార్చ్ నాటికీ పూర్తి చేసారు. 2nd ఇయర్ పరీక్షలు మార్చ్ 20th నాటికీ పూర్తి చేసారు. పరీక్షా పత్రాల మూల్యాకనం కూడా ప్రారంభించిన బోర్డు అధికారులు ఫలితాలను ఈ నెల 12నుండి 15 వ తేదీలోగా విడుదల చేయాలనీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పేపర్ కరెక్షన్ ను ఏప్రిల్ 6వ తేదీలోగా పూర్తి చెయ్యాలని చూస్తున్నట్లు తెలిపారు.

గతంలో ఎప్పుడు ఫలితాలు వచ్చాయి :

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన గత సంవత్సరాల హిస్టరీ చుస్తే, 2024 ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12th,
2023 ఫలితాలను ఏప్రిల్ 26న, 2022 ఫలితాలను జూన్ 22న అధికారులు విడుదల చేయడం జరిగింది. అయితే 2025 ఫలితాలను కూడా ఏప్రిల్ 12నుండి 15 వ తేదీలోగా విడుదల చేయాలని చూస్తున్నట్లు బోర్డు వర్గాల నుండి సమాచారం .

వాట్స్ అప్ లోనే రిజల్ట్స్ :

విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్ చూసుకోవడానికి వేరే వెబ్సైటు లోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా సొంత మొబైల్ వాట్సాప్ లోనే రిజల్ట్స్ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ +91 9552300009 ను సేవ్ చేసుకొని, హాయ్ అని మెసేజ్ చేసినట్లఅయితే వెంటనే 200 సేవలకు సంబందించిన లింక్ వస్తుంది. అది క్లిక్ చేసి ap ఇంటర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ క్లిక్ చేస్తే విద్యార్థులకు రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి. మర్క్స్ మెమో కూడా వాట్సాప్ నుంచేపొందవచ్చు . ఇలా సింపుల్ విధానంలో విద్యార్థులు రిజల్ట్స్ చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

రిజల్ట్స్ అస్సలు ఎపుడు వస్తాయి :

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 12 నుండి 15 వతేదీ లోగ విడుదల చేయడానికి అధికారులు, మంత్రి లోకేష్ సిద్ధమయ్యారు . అంటే కనిష్టంగా 6 రోజులు నుండి 9 రోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి.
ఇతర అధికారిక వెబ్సైటు లో కూడా ఫలితాలు చూడచ్చు. వాట్సాప్లో రిజల్ట్స్ చూసుకోవడం కుదరకపోతే విద్యార్థులు ఈ క్రింద లింక్ ద్వారా రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు.
bieap.gov.in
resultsbie.ap.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *