AP EAMCET 2025 Update: రేపు ఒక్కరోజే సమయం: విద్యార్థులు ఇవి సబ్మిట్ చెయ్యకపోతే వెయిటేజీ మార్క్స్ ఇవ్వరు: వెంటనే ఇలా చెయ్యండి

AP EAMCET 2025 Exam 2025:

ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇంటర్ మార్కులు వెబ్సైట్లోనే డిక్లరేషన్ ఫారంలో లాగిన్ అయ్యి, మీరు గతంలో సబ్మిట్ చేసిన ఇంటర్ మార్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని, మార్కులను సరి చేసుకోవాలని ఇంటర్ బోర్డు కన్వీనర్ తెలిపారు. ఇంటర్ మార్కులు సరిగ్గా లేని పక్షంలో, ఆ విద్యార్థులకు ఎంసెట్లో 25% వెయిటేజ్ మార్కులు కలపడానికి ఇబ్బందులు తలెత్తుతాయని బోర్డు తెలిపింది. కావున ఎంసెట్ పరీక్ష రాసిన ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థి వారి యొక్క మార్కులను డిక్లరేషన్ ఫారం లో సరిచూసుకోవాలి. ఇలా ఎడిట్ చేసుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం అయితే ఇచ్చారు. వీటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనే పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది , ఒక సారి గమనించగలరు.

ముఖ్యమైన సూచనలు:

వెయిటేజీ మార్కులు: AP EAMCETలో 75% వెయిటేజీ మార్కులు పరీక్షలో సాధించిన మార్కులపై ఆధారపడి ఉంటాయి. ఇతర 25% మార్కులు ఇంటర్ (12వ తరగతి) మార్కుల ఆధారంగా ఉంటాయి .

పరీక్ష తేదీలు:

ఇంజినీరింగ్: మే 21 నుంచి 27, 2025 వరకు

వ్యవసాయం & ఫార్మసీ: మే 19 & 20, 2025 .

ఫలితాల విడుదల: జూన్ 5, 2025.

ఏపీ ఇంటర్ మార్క్స్ అప్డేట్ డిక్లరేషన్ ఫారంలో ఎలా Edit  చెయ్యాలి?

ఇంటర్మీడియట్ పరీక్షల్లో వచ్చినటువంటి సబ్జెక్టుల వారి మార్కులను ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్ లోని డిక్లరేషన్ ఫారం లో లాగిన్ అయ్యి, మార్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసి, ప్రతి సబ్జెక్టు యొక్క మార్కులను సరిచూసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇప్పుడు డిక్లరేషన్ ఫారం లో మార్కులను ఏ విధంగా సరి చేసుకోవాలో చూద్దాం.

1.ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి.
2.వెబ్సైట్ హోం పేజీలో ” declaration form” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3.విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ , రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
4.ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇచ్చిన ఎంటర్ మార్కుల జాబితా సబ్జెక్టుల వారిగా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేయండి.
5.కరెక్ట్ గా లేని సబ్జెక్టులో మార్పులను సరిచేసుకొని ఎడిట్ చేయండి
6. ఎడిట్ చేసి మళ్ళీ డిక్లరేషన్ ఫారంని సబ్మిట్ చేయండి.

అవసరమైన డాక్యుమెంట్లు:

పరీక్ష ఫలితాలు విడుదలైన తరువాత, కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు క్రింది డాక్యుమెంట్లను submit చేయాలి .

1.ఫోటో

2.సంతకం

3.రెసిడెన్స్ సర్టిఫికేట్

4.ఇన్‌కమ్ సర్టిఫికేట్

5.కుల సర్టిఫికేట్ (SC/ST/OBC)

6.స్టడీ సర్టిఫికేట్

7.PH/NCC/స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (అవసరమైతే)

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply