AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 8న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులందరూ కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. దానికి అనుగుణంగా సర్టిఫికెట్లను రెడీ చేసుకోవాలి.అయితే గత సంవత్సరాల్లో జరిగిన కౌన్సిలింగ్ డేట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కావచ్చు అనేటటువంటి ఎక్స్పెక్టెడ్ డేట్స్ తో పాటు, ర్యాంకుల వారిగా కాలేజీల వివరాలు, వెబ్ ఆప్షన్ల తేదీల గురించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. సారి గమనించగలరు.
AP EAMCET 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ : వాటి వివరాలు :
క్రింద తెలిపిన కౌన్సిలింగ్ తేదీలు కేవలం అంచనా తేదీలు మాత్రమే. అధికారిక ఎంసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు.
| even name | Expected dates |
| నోటిఫికేషన్ విడుదల ఏ తేదీ | జూన్ 25, 2025 |
| సర్టిఫికెట్ల పరిశీలన చేసే తేదీలు | జూన్ 27 – జూలై 3 |
| వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకునే తేదీ | జూలై 4 – జూలై 8 |
| మొదటి ఫేజ్ సీట్ కేటాయింపు తేదీ | జూలై 10, 2025 |
కావాల్సిన డాకుమెంట్స్ వాటి వివరాలు:
క్రింద తెలిపిన డాకుమెంట్స్ విద్యార్థులు తప్పకుండ తమతో తీసుకెళ్లాలి
1. ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్
2. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
3. పదో తరగతి మార్క్స్ మెమో
4. కుల ధ్రువీకరణ పత్రాలు
5. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
6. నివాస ధ్రువీకరణ పత్రం
7. ఆధార్ కార్డు
ప్రతి సర్టిఫికెట్ రెండు జిరాక్స్ కాపీలు తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
వెబ్ ఆప్షన్స్ సమయంలో పాటించాల్సిన నియమాలు?: వాటి వివరాలు:
1. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కనీసం 30 నుండి 40 కాలేజీలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
2. గత ఏడాది కట్ ఆఫ్ మార్కులను రిఫరెన్స్ గా తీసుకోండి.
3. ప్రభుత్వ లేదా యూనివర్సిటీ కళాశాలల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
4. ఆప్షన్స్ ఇవ్వడానికి ముందే మీరు ప్రాధాన్యత క్రమంలో ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోండి.
5. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ లిస్టు ని లాక్ చేయండి.
ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ లింక్ : https://eapcet-sche.aptonline.in
మరిన్ని వివరాలకు ఈ వెబ్సైటు ను సందర్శించండి

