AP EAMCET 2025 Counselling Expected Date: ఈ 11 సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోండి

AP EAMCET 2025 Counselling Expected Date:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలను జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు కౌన్సిలింగ్ పై దృష్టి పెట్టారు.అయితే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి . మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు .

AP EAMCET 2025 counselling expected date:

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రతిసారి ఫలితాలు విడుదలైన మూడు నుండి నాలుగు వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఇప్పుడు కూడా జూలై మొదటి వారంలో అనగా జూలై 3 నుండి ప్రారంభం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
APSCHE అధికారిక వెబ్సైట్ ద్వారా మీకు కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తారు.

కౌన్సిలింగ్ కోసం సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్, వాటికీ సంబందించిన ముఖ్యమైన వివరాలు :

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ మీరు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఈ క్రింద తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

1. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్
2.ఏపీ ఎంసెట్ హాల్ టికెట్
3.ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
4.పదవ తరగతి మార్క్స్ మెమో
5.ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
6.స్టడీ సర్టిఫికెట్స్ 6 నుండి 12వ తరగతి వరకు
7.ఇన్కమ్ సర్టిఫికెట్
8.రెసిడెన్సి సర్టిఫికెట్
9.ఆధార్ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్
10.EWS/OBC/SC/ST/PWD సర్టిఫికెట్
11.లోకల్ స్టేటస్ సర్టిఫికెట్

పైన తెలిపిన అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్ కాపీలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి.

AP EAMCET 2025 counselling process:

కౌన్సిలింగ్ మొత్తం ఈ క్రింది దశలవారీగా జరుగుతుంది.

1.ముందుగా అధికారిక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

2.విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించడానికి అవకాశం ఇస్తారు.
3.హెల్ప్ లైన్ సెంటర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
4.కోర్సులు లేదా కళాశాలల ఎంపిక చేస్తారు.
5.సీటు కేటాయింపు చేస్తారు.
6.ఇంకా చివరిగా ఎంపికైన కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వడమే.

Web options and seat allotment:

1.ర్యాంక్ ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది

2.ఒకటికంటే ఎక్కువ కాలేజీలో మరియు కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు

3.సీట్ allotment తర్వాత మీకు వచ్చినటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి లేదా రెండవ రౌండ్ కోసం వెయిట్ చేసుకోవచ్చు.

కౌన్సిలింగ్ ఫీజు :

వివరాలు అధికారికంగా విడుదల చేయలేదు, కావున మనం ఇప్పుడే కౌన్సిలింగ్ ఫీజు ఎంత ఉంటుందో చెప్పలేము.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను ప్రతి రోజు సందర్శించండి .

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply