AP EAMCET 2025: Rank vs MBU seat:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాల్లో ర్యాంకులు వచ్చిన వారికి చిత్తూరు జిల్లా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మొత్తం ఎంత ర్యాంకు రావాలి?, ఏ బ్రాంచ్ వస్తుంది?, ఎంత ఫీజు ఉంటుంది? అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం . మోహన్ బాబు యూనివర్సిటీ కళాశాలకు స్వతహాగానే ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి చాలామంది విద్యార్థులకు కటాఫ్ ర్యాంక్స్ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సమాచారాన్ని తెలుసుకోండి.
మోహన్ బాబు యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అంటే ఎంత రాంక్ రావాలి ? వాటి వివరాలు :
1. ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకు తప్పనిసరిగా ఉండాలి.
2. కౌన్సిలింగ్ సమయంలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు MBU యూనివర్సిటీ కి ప్రాధాన్యత ఇవ్వాలి
3. డైరెక్ట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటాలో పొందడానికి కూడా అవకాశం ఉంది.₹2 రెండు లక్షల నుండి ₹3 లక్షల వరకు మేనేజ్మెంట్ కోట సీటుకు డబ్బులు చెల్లించాలి.
మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) లో సీట్ రావాలి అంటే బ్రాంచ్ల వారీగా కటాఫ్ ర్యాంక్స్ క్రింది విధం గా చెక్ చేసుకోండి.
Branch name
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాలు
|
2024 cutoff Approx. Rank (OC Category) | Annual Fee | Intake (Seats) | Placement Scope |
CSE ( computer science engineering) | 12,000 లోపు | ₹1,80,000/- – ₹2,00,000/- | 180+ | High(Product, MNCs) |
CSE AI-ML | 18,000 లోపు | ₹2,00,000/- | 60+ | High (AI, Data Science) |
ECE ( electronic and communication ) | 25,000 లోపు | ₹1,60,000/- | 120+ | Medium to High |
ME ( mechanical engineering ) | 40,000 లోపు | ₹1,20,000/- | 60+ | Medium |
CE ( civil Engineering) | 50,000 లోపు | ₹1,00,000/- | 60+ | Medium |
EEE (Electrical Engineering) | 35,000 లోపు | ₹1,20,000/- | 60+ | Medium |
ముఖ్య గమనిక:ఈ కటాఫ్ ర్యాంకులు 2024 కు సంబంధించినవి. 2025 ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో కొంతమంది మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. క్యాటగిరీల వారిగా, బ్రాంచ్ ల వారీగా కొంతమేర చేంజెస్ ఉంటాయి.
మోహన్ బాబు యూనివర్సిటీ ఫీచర్స్:
1. NAAC A+ accreditation
2. 100% placement assistance
3. internship opportunities with MNCs
4. Hyderabad and Bangalore IT connections