ICDS JOBS : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక | AP DWCWE One Stop Center Jobs 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా & శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయం (DWCWE) ఆధ్వర్యంలో పనిచేసే వన్ స్టాప్ సెంటర్ (One Stop Center) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా Central Administrator, Psycho Social Counsellor, Para Legal Personnel/Lawyer, Case Worker, Office Assistant (Computer Knowledge), Paramedical Staff, Security/Night Guard మరియు Multi-Purpose Staff / Cook పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 13.03.2026.
ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబడతాయి.
పోస్టుల వివరాలు
వన్ స్టాప్ సెంటర్, టెక్కలి (శ్రీకాకుళం జిల్లా)లో పని చేయడానికి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు క్రింద ఇవ్వబడ్డాయి.
వయో పరిమితి
01.01.2026 నాటికి అభ్యర్థుల వయస్సు:
- కనీసం : 25 సంవత్సరాలు
- గరిష్టం : 42 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
గమనిక: చాలా పోస్టులు మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడ్డాయి.
విద్యా అర్హతలు
Central Administrator
- లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి
- మహిళలకు సంబంధించిన ప్రాజెక్ట్ లేదా ప్రోగ్రామ్‌లలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి
- కౌన్సెలింగ్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండటం మంచిది
- స్థానిక కమ్యూనిటీ నివాసి అయితే ప్రాధాన్యం ఉంటుంది
Psycho Social Counsellor
- సైకాలజీ / సైకియాట్రీ / న్యూరో సైన్స్ వంటి విభాగాల్లో ప్రొఫెషనల్ డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి
- ఆరోగ్య రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి
Para Legal Personnel / Lawyer
- న్యాయశాస్త్రంలో డిగ్రీ (LLB) ఉండాలి
- మహిళా సంబంధిత ప్రాజెక్ట్‌లలో 3 సంవత్సరాల అనుభవం లేదా
- కోర్టులో 2 సంవత్సరాల ప్రాక్టీస్ అనుభవం ఉన్న న్యాయవాది కావచ్చు
Case Worker
- లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ
- మహిళలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లలో 3 సంవత్సరాల అనుభవం
- స్థానిక ప్రాంతానికి చెందిన మహిళలకు ప్రాధాన్యం
Office Assistant (Computer Knowledge)
- ఏదైనా గ్రాడ్యుయేషన్
- కంప్యూటర్ / ఐటి లో డిప్లొమా
- డేటా మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్ మరియు వెబ్ రిపోర్టింగ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం
Paramedical Staff
- పారామెడికల్ రంగంలో డిప్లొమా లేదా డిగ్రీ
- ఆరోగ్య రంగంలో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం
Security / Night Guard
- ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థలో కనీసం 2 సంవత్సరాల భద్రతా సిబ్బంది అనుభవం
- పదవీ విరమణ చేసిన సైనిక / పారా మిలటరీ సిబ్బందికి ప్రాధాన్యం
Multi Purpose Staff / Cook
- అక్షరాస్యత ఉండాలి
- సంబంధిత పనిలో అనుభవం ఉండాలి
- 10వ తరగతి లేదా సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం
నెల జీతం
నోటిఫికేషన్ ప్రకారం పోస్టు ఆధారంగా నెలకు:
₹13,000 నుండి ₹34,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.
దరఖాస్తు విధానం
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
వెబ్సైట్:
https://srikakulam.ap.gov.in
అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపి, క్రింది పత్రాల జిరాక్స్ కాపీలను జతచేయాలి.
- విద్యా అర్హత సర్టిఫికేట్లు
- మార్కుల జాబితాలు
- అనుభవ ధృవీకరణ పత్రాలు
- ఇతర అవసరమైన డాక్యుమెంట్లు
తర్వాత ఈ అప్లికేషన్‌ను 07.03.2026 నుండి 13.03.2026 సాయంత్రం 5:00 గంటలలోపు క్రింది చిరునామాకు పంపాలి లేదా నేరుగా సమర్పించాలి.
చిరునామా:
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం & సాధికారత అధికారి
80 అడుగుల రోడ్డు, పెట్రోల్ బంక్ ఎదురుగా
శ్రీకాకుళం – 532001
ఆలస్యంగా వచ్చే దరఖాస్తులు పరిగణించబడవు.
ఎంపిక విధానం
- అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలించి
- అర్హత ఉన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు
- తరువాత ఇంటర్వ్యూకు పిలుస్తారు
ముఖ్య గమనిక
ఈ నోటిఫికేషన్‌ను ఎప్పుడైనా రద్దు చేసే హక్కు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ / వన్ స్టాప్ సెంటర్ ఛైర్మన్, శ్రీకాకుళం వారికి ఉంటుంది.
Notification PDF – Click Here
Application PDF – Click Here
Official Website – Click Here
For More Jobs Related Information:
Follow Our What’s App Channel : Join Now

