
AP DSC 2025: ఏపి డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సూచనలు ఇవ్వడం జరిగింది.
AP DSC 2025 Update :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ వారు మెగా డీఎస్సీ పై కొన్ను కీలక సూచనలు విడుదల చేసారు. విద్యాశాఖ డైరెక్టర్ AP DSC 2025 గురించి అభ్యర్థులు ముఖ్యం గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విడుదల చేసారు. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విద్యాశాఖ డైరెక్టర్ చెప్పిన వివరాలు:
పాఠశాల విద్య కార్యాలయం లో HELPDESK ప్రారంభించడం జరిగింది. అభ్యర్థులు ఏదైనా సందేహాలు ఉంటే వాటికీ సంబందించిన పరిష్కారాలు అక్కడి నుండి ఇవ్వడం జరుగుతుంది. వాటి కోసం ఆఫిసిఅల్ వెబ్సైటు నందు ఉన్న నంబర్లకు కాల్ చేయవచ్చు.
మెగా డీ యస్సీ 2025 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కింద ఇవ్వడం జరిగింది.
- వివాహిత మహిళా అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్ లో ఉన్న ఇంటి పేరు నే దరఖాస్తులో నింపాలి.
- ఒకే అప్లికేషన్ లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఒకే పోస్టుకు ఒక జిల్లాలో లోకల్ మరొక జిల్లా లో నాన్ లోకల్ కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు అనగా ఒక పోస్టుకు ఒక జిల్లా లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారంలో ఒకటి రెండు విభాగాలలో వివరాలు ఎన్ని సార్లు అయినా సవరణలు చేసుకోవచ్చు.
- ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత సవరణకు అవకాశం ఉండదు.
- పైన చెప్పిన సూచనలు అన్ని అభ్యర్థులు దృష్టి లో పెట్టుకొని దరఖాస్తు చేయవచ్చు. అలాగే టెట్ మార్కుల వివరాలు వెబ్సైటులో అందుబాటులో ఉంచుతామని తెలపడం జరిగింది.
Leave a Reply