AP DSC హాల్ టికెట్స్ విడుదల : AP DSC Hall Tickets Released

AP DSC హాల్ టికెట్స్ విడుదల : AP DSC Hall Tickets Released

AP DSC Hall Tickets 2025 :

మెగా dsc రిక్రూట్మెంట్ పరీక్ష కు సంబంధించి అడ్మిట్ కార్డు ఈరోజు ఈ వెబ్సైటు https://apdsc.apcfss.in/ అందుబాటులోఉంటుంది. పరీక్షలు జూన్ 6 వ తేదీ నుంచి జులై 6 వ తేదీ మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా CBT జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షా సమయం కంటే ముందే హాజరు కావాలి .

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) ఉపాధ్యాయ నియామక ప్రక్రియ కోసం AP DSC 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా ముగించింది. అధికారిక సమాచారం ప్రకారం.. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన పోస్టులకు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 5.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. అంటే ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలు, AP DSC 2025 హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh) ఈ మెగా డీఎస్సీ 2025 ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్స్ (SA), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ప్రిన్సిపల్స్ వంటి పోస్టులు ఉన్నాయి. అయితే.. ఈ జంబో డీఎస్సీ (Mega DSC) టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈసారి పోస్టుల సంఖ్య భారీగా ఉండటంతో పోటీ కూడా అంతేస్థాయిలో ఉండనుంది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply