AP High Court Exams 2025:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1620 పోస్టులను భర్తీ చేయడానికి మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి మే 13వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకుషిఫ్టుల వారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ ని ఆగస్టు 13వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు ఇచ్చిన పరీక్ష సెంటర్ కి వెళ్లి అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు 1620 పోస్టుల యొక్క హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
హాల్ టికెట్స్ ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలి?:
హాల్ టికెట్స్ ఈ క్రింది విధం గా డౌన్లోడ్ చేసుకోండి.
1. ముందుగా ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. వెబ్ సైట్ లో “AP Court Exams 2025 Hall Tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అభ్యంతర యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ , పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. అభ్యర్థుల యొక్క డాష్ బోర్డులో, హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటది దాని పైన క్లిక్ చేయండి.
5. వెంటనే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
6. అది ప్రింట్ అవుట్ తీసుకొని, అందులో ఉన్న పరీక్ష సెంటర్, పరీక్ష తేదీ వివరాలు గమనించండి.
హాల్ టికెట్స్ విడుదల చేసే తేదీ?: వాటి వివరాలు:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు 1620 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ ని ఆగస్టు 13, 2025 నుండి డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారులు వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఆరోజు నుండి పరీక్షలు పూర్తయి వరకు అభ్యర్థులు మీయొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని, పరీక్షలకు హాజరు కావలెను.
ఏపీ జిల్లా కోర్టు పరీక్షల ముఖ్యమైన షెడ్యూల్:
జిల్లా కోర్టు పరీక్షల షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.
పోస్ట్ పేరు | పరీక్ష సెక్షన్స్ | పరీక్ష జరిగే తేదీలు |
ఆఫీసు సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ పోస్టులు | 6 సెషన్స్ | 20th ఆగష్టు, 2025 21st ఆగష్టు, 2025 |
రికార్డు అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్ | 2 సెషన్స్ | 22nd ఆగష్టు, 2025 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ | 6 సెషన్స్ | 23rd ఆగష్టు, 2025 24th ఆగష్టు, 2025 |
హాల్ టికెట్స్ డౌన్లోడ్ ప్రారంభ తేదీ | ________ | ఆగస్టు 13, 2025 |