AP 10th Results 2025/ AP SSC Results Release date 2025:

AP 10th Results 2025:

ఆంధ్రప్రదేశ్ బోర్డు అఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పెద్ద శుభవార్త విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క ఫలితాలను విడుదల చేసే తేదీ పై ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 10th పరీక్షలను
మార్చ్ 17th నుండి మార్చ్ 31st వరకు నిర్వహించడం జరిగింది. అయితే పరీక్షా పత్రాల మూల్యాకనం ఏప్రిల్ 3rd నుండి ఏప్రిల్ 9th వరకు నిర్వహించడం జరుగుతుంది అని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే పేపర్స్ కర్రెక్షన్ ప్రారంభించిన అధికారులు రోజుకి 45 పేపర్స్ ఒక టీచర్ కరెక్షన్ చెయ్యాలని నిబంధన పెట్టారు. దీంతో 9th ఏప్రిల్ 2025 నాటికీ కరెక్షన్ పూర్తి చేసి ఏప్రిల్ చివరి వారంలోపు ఫలితాలను విడుదల చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వాట్స్ అప్ లోనే 10th రిజల్ట్స్?…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ ద్వారా ఇప్పటికే 200 సేవలను అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల ఇంటర్ ,10th పరీక్షల హాల్ టికెట్స్ కూడా వాట్స్ అప్ లోనే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే 10th , ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వాట్సాప్ లోనే చేసుకొని మార్కసమేమో కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. కావున ఇంటర్ ఫలితాలతో పాటు 10th రిజల్ట్స్ కూడా వాట్స్ అప్ లోనే చూసుకోవచ్చు.

10th ఫలితాల విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాలను ఏప్రిల్ 4 వ వారంలోనే విడుదల చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్స్ కరెక్షన్ 8వ తేదీ కి పూర్తి చేస్తారని , తర్వాత నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుందని బోర్డు అధికారులు తెలిపారు.

వాట్స్ అప్ లో ఎలా చూడాలి?:

మొదటగా వాట్సాప్ గవర్నేన్స్ నెంబర్ 9552300009 ని మొబైల్ లో సాస్ చేసుకొని, ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయాలి .

వాట్సాప్ గవర్నేన్స్ సేవల లింక్ మీకు మెసేజ్ రూపం లో వస్తుంది.
అందులో AP 10th రిజల్ట్స్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి.
విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్స్ పై క్లిక్ చెయ్యాలి.
వెంటనే రిజల్ట్స్ మీ వాట్సాప్ లోనే డౌన్లోడ్ అవుతాయి.
ఇతర వెబ్సైట్ ద్వారా కూడా ఫలితాలను డౌన్లోడ్ చేకోవచ్చు. వాట్సాప్ లో ఫలితాలను చూడలేని వారు ఈ క్రింది లింక్స్ ద్వారా తమ 10th రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని మర్క్స్ మెమో కూడా పొందవచ్చు.
https://www.bse.ap.gov.in/

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply