AP పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు శుభవార్త – ₹6,000/- అకౌంట్ లో జమ చేయనున్న ప్రభుత్వం: ఇలా Apply చేసుకోండి

AP School Students Travel Assistance Scheme 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాల ఇంటి నుంచి కిలోమీటరు కంటే దూరం ఉంటే రవాణా ఖర్చులు చెల్లిస్తారు. ఇలా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.6,000 తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు జులై 5న ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశంలో దీనిపై చర్చిస్తామని తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థి యొక్క స్కూలు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు ట్రావెల్ assistance కింద సంవత్సరానికి ₹6000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేసే విధంగా కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గి పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచే విధంగా అలాగే విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ని ప్రభుత్వ పాఠశాలలో పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య సమాచారం:

1. పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పది నెలలకు గాను ₹6,000/- అకౌంట్లో జమ చేస్తారు.
కావలసిన అర్హతలు: విద్యార్థి యొక్క పాఠశాల దూరం ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
మొదటి దశలో : పది జిల్లాల్లో పైలెట్ ప్రోగ్రాం కింద ప్రారంభించి, సుమారు 600 పాఠశాలలు, 10,000 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
డబ్బులు ఎలా చెల్లిస్తారు: విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఖాతాలకు డబ్బులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి.

ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?: వాటి వివరాలు :

1. పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు పెంచడం, డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించడం
2. తల్లిదండ్రులపై పడుతున్నా రవాణాచార్జిల భారాన్ని తగ్గించడంతో విద్యార్హతల్లో మెరుగుదల వస్తుంది
3. ఈ పథకం “సమగ్ర శిక్ష అభియాన్” ఆధారంగా అమలవుతుంది.

ఈ పథకం అమలు చేసే విధానం:

1. జూలై నెల 5న విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఈ ప్రోగ్రాం పై తుది నిర్ణయం తీసుకొని అన్నారు.
2. విద్యార్థులను ఆటో లేదా పబ్లిక్ బస్సుల ద్వారా వెళ్లేందుకు ఇష్టపడుతారా ? లేదా అన్న విషయం పైన స్పష్టత ఇవ్వనున్నారు.
3. విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ కి డబ్బులను డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా అసిస్టెంట్ చేయబడుతుంది.

అప్లికేషన్ ప్రాసెస్ ఎలా? ఈ క్రింది విధం గా చేసుకోవాలి?

కొత్తగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

1. ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యానికి దరఖాస్తు చేసుకోవడానికి buspassonline.apsrtconline.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2. 12 ఏళ్లలోపు ఒక విద్యార్థులకు , 15 ఏళ్లలోపు బాలికలకు బస్సు పాస్ ఉచితం
3. 20 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

బస్సు పాస్ పొందడానికికావాల్సిన సర్టిఫికెట్స్ :

1. స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్
2. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
3. విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
4. విద్యార్థి ఒక డేటా స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లోని ఇది అమలు చేస్తున్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రాం ని ప్రారంభించడం జరుగుతుంది.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply