AP EAMCET 2025:
2025 లో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల్లో మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అర్హత పొందినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 వెబ్ సైట్ లో జులై 6వ తేదీలోగా డిక్లరేషన్ ఫారం పూర్తి చేసి మళ్లీ సబ్మిట్ చేయాలని, ఏపీ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో కొత్త అప్డేట్ కింద అది స్క్రోలింగ్ కూడా అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అలాగే ఏపీ ఎంసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారు కచ్చితంగా గడువులోగా మీ యొక్క వివరాలను పూర్తి చేసి డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయవలెను. దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
డిక్లరేషన్ ఫారం ఎలా పూర్తి చేయాలి?: వాటి వివరాలు :
ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం ఈ క్రింది విధంగా చేయండి
1. ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోం పేజ్ లో ” declaration form” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. విద్యార్థుల యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
4. మీ యొక్క డిక్లరేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఆ ఫారం లో ఉన్న పూర్తి వివరాలు మళ్లీ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.
5. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి పని.
6. ఫారం సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు మరొకసారి చూసుకొని సబ్మిట్ చేయవలెను.
డిక్లరేషన్ ఫారం ఏ విధంగా పూర్తి చేయాలి? సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ:
ఏపీ ఎంసెట్ అధికారికి వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫారం లోని అన్ని వివరాలు పూర్తి చేసే సబ్మిట్ చేయడానికి జులై 6వ తేదీని ఆఖరి తేదీగా అధికారులు తెలిపారు. కావున విద్యార్థులందరూ కూడా గడువులోగా డిక్లరేషన్ ఫారం లో మార్పులు, చేర్పులు అన్నీ చేసుకుని ఎటువంటి తప్పులు లేకుండా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
AP ఎంసెట్ వెబ్ సైట్ లో డిక్లరేషన్ ఫారం ఎలా సబ్మిట్ చేయాలి ? ఎవరు సబ్మిట్ చేయాలి?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్ లో డిక్లరేషన్ ఫారం ని ఈ క్రింది విధంగా విద్యార్థులు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది
1. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025లో ఉత్తీర్ణులైన వారు. అనగా అర్హత పొందిన వారు
2. అలాగే, 2025 లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి అందులో అర్హత పొందినటువంటి వారు డిక్లరేషన్ ఫారం ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
జూలై 6, 2025 సాయంత్రం 5 గంటల లోపు.
పైన తెలిపిన ప్రాసెస్ ద్వారా డిక్లరేషన్ ఫారం ని ఏపీ ఎంసెట్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అర్హత పొందిన ప్రతి విద్యార్థి వెంటనే సబ్మిట్ చేసుకోగలరు.