Telangana Anganwadi Job Vacancy Update :
తెలంగాణ రాష్ట్రం లో మహిళా శిశు సంక్షేమ శాఖ లో 35,700అంగన్వాడీ కేంద్రలలో 14,236 కొత్తగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి . అంగన్వాడీ కేంద్రాలలో 14,236 అంగన్వాడీ ఉద్యోగాలలో 6,399 అంగన్వాడీ టీచర్ ఖాళీలు, 7,837 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి కమిటీ ఏర్పాటు: లేటెస్ట్ అప్డేట్ :
గతం లో అంగన్వాడీ శిశు సంక్షేమ శాఖ నుంచి 14,236 ఉద్యోగాల నియామకం కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. ఈ కాస్త సమయం లో 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ సహాయక ఉద్యోగుల పదవి విరమణ పొందిన నైపథ్యం లో మరిన్ని ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కి కమిటీ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం లో అంగన్వాడీ సిబ్బంది నియామకాల్లో ఆదివాసీ, గిరిజన స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రత్యేక రోస్టర్ పాయింట్ల ఖరారు చేయాలనీ శిశు సంక్షేమ శాఖ కమిటీ నియమించారు.
అనంతరం నూతన రోస్టర్ పాయింట్ల ఆధారం గా 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.