రిప్కో బ్యాంక్ (Repco Bank Marketing Associate Recruitment 2025) :
భారత ప్రభుత్వ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న బ్యాంక్, మార్కెటింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకం కాంట్రాక్టు ప్రాతిపదికన 11 నెలలపాటు ఉంటుంది, అవసరాన్ని బట్టి కాలపరిమితి పొడిగించవచ్చు. బ్యాంకు ద్వారా ఇవ్వబడే రుణాలకు సంబందించి కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు ఈ పోస్టు రూపొందించబడింది. మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న, ఫీల్డ్‌లో పని చేయగల అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
సంస్థ పేరు: రిప్కో బ్యాంక్ (Repco Bank)
పోస్టు పేరు: మార్కెటింగ్ అసోసియేట్ (Marketing Associate) పూర్తి కాంట్రాక్ట్ పద్ధతిలో 11 నెలల పాటు నియామకం ఉంటుంది. పనితీరు ఆధారంగా పొడిగించవచ్చు.
ఖాళీల సంఖ్య: 10 పోస్టులు
అర్హతలు : (30.06.2025 నాటికి):
1. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. మార్కెటింగ్ స్పెషలైజేషన్ లేదా పీజీ మార్కెటింగ్ ఉంటే ప్రాధాన్యత.
3. మార్కెటింగ్ రంగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత.
4. ఇంగ్లీష్ మరియు తమిళం/ప్రాంతీయ భాషలో నైపుణ్యం అవసరం.
5. స్వంత బైక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు ప్రాధాన్యత.
6. మార్కెటింగ్ పై ఆసక్తి ఉండాలి.
నెల జీతం: ₹12,000 + ₹3,000 (conveyance) = ₹15,000 వరకు ఉంటుంది. incentives కూడా ఉంటాయి
వేరియబుల్ ఇన్సెంటివ్ (రుణాల మొత్తంపై ఆధారపడి) ఉంటాయి .
రుణ పరిమాణం | శాతం (వేరియబుల్ ఇన్సెంటివ్) |
---|---|
₹1 కోటి వరకు | 0.25% |
₹1 కోటి – ₹3 కోట్లు | 0.15% |
₹3 కోట్లకు పైగా | 0.10% |
ప్రతి లోన్ ఫైల్ కు అదనంగా ₹1000 ఇన్సెంటివ్
దరఖాస్తు ఎలా చేయాలి?

The General Manager (Admin),
Repco Bank Ltd, P.B.No.1449,
Repco Tower, No:33, North Usman Road,
T.Nagar, Chennai – 600 017.
ఎంపిక విధానం:
1. అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
2. ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఇతర ముఖ్యమైన విషయాలు:
1. ఈ పోస్టు కాంట్రాక్టు ఆధారంగా మాత్రమే ఉంటుంది. 2. రెగ్యులర్ ఉద్యోగంగా మారదు
3. ఇతర ఉద్యోగ ప్రయోజనాలు (PF, gratuity వంటివి) వర్తించవు
4. ఎంపిక అయిన వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చివరి తేదీ: 05.08.2025
అధికారిక వెబ్‌సైట్: www.repcobank.com