SGPGIMS Jobs Notification 2025:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త! సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – SGPGIMS నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1479 పోస్టులు భర్తీ చేయనున్నారు. మీరు B.Sc, B.Com, డిగ్రీ, డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉంటే తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
సంస్థ వివరాలు :
ఈ ఉద్యోగాలు SGPGIMS (Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences) లోని నాన్ టీచింగ్ విభాగానికి చెందినవి. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ ప్రభుత్వ మెడికల్ ఇన్స్టిట్యూట్.
మొత్తం ఖాళీలు:
SGPGIMS Jobs Notification 2025 ఈ నోటిఫికేషన్ ద్వారా 1479 నాన్ టీచింగ్ పోస్టులు విడుదలయ్యాయి.
ఈ ఉద్యోగాలు వివిధ గ్రూప్ B, C, D కేడర్‌కి చెందినవిగా ఉన్నాయి.
విద్యార్హతలు : అభ్యర్థులు B.Sc, B.Com, General Degree, Diploma పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
1. కనీసం: 18 సంవత్సరాలు
2. గరిష్టంగా: 40 సంవత్సరాలు
3. SC/ST అభ్యర్థులకు – 5 ఏళ్ల వయస్సు సడలింపు
4. OBC అభ్యర్థులకు – 3 ఏళ్ల వయస్సు సడలింపు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
Category | Fee |
---|---|
UR / OBC / EWS | ₹1180 |
SC / ST | ₹708 |
UR / OBC (Few Posts) | ₹500 |
PWD | Fee మినహాయింపు ఉంది |
ఫీజు Online ద్వారా చెల్లించవలెను.
జీతం వివరాలు:
SGPGIMS Jobs Notification 2025 ఈ పోస్టులకి సంబంధించి జీతం ₹30,000 నుండి ₹70,000 వరకు ఉంటుంది.
పే స్కేల్ ఉద్యోగం ఆధారంగా ఉంటుంది మరియు DA, HRA, Medical Allowances వంటి అన్ని ప్రభుత్వ అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం (Selection Process):
1. Computer Based Test (CBT)
2. Merit ఆధారంగా ఎంపిక
3. Medical Examination
4. Document Verification
5. ఫైనల్‌గా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
1. SGPGIMS అధికారిక వెబ్‌సైట్ కి వెళ్ళండి.
2. Recruitment 2025 Section ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి.
3. మీ అర్హత ఆధారంగా సరైన పోస్టును ఎంచుకోండి.
4. ఆన్‌లైన్ ఫారం ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
6. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది – దాన్ని భద్రంగా ఉంచుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ: జూలై 18, 2025
website: www.sgpgims.org.in