NMMS ((National Means Cum Merit Scholarship) Scholarships 2025:
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (National Means Cum Merit Scholarship) స్కీమ్ కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ జూన్ 2, 2025 అధికారికంగా విడుదల చేశారు. 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కాలర్షిప్ పరీక్ష రాసి,ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు అనగా (12వ తరగతి) వరకు సంవత్సరానికి ₹12,000 రూపాయలు స్కాలర్షిప్స్ విద్యార్థి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అయితే ఈ స్కాలర్షిప్స్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, రాత పరీక్ష ఎలా ఉంటుందనేటువంటి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
NMMS స్కాలర్షిప్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? వాటి వివరాలు:
1. MAT ( mental ability test) : రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ టెస్ట్ నుంచి 90 ప్రశ్నలు, 90 నిమిషాలు నిర్వహిస్తారు.
2. SAT ( scholarship aptitude test ): సైన్స్, మాథ్స్, సోషల్ సైన్స్ టాపిక్స్ నుంచి 90 ప్రశ్నలు, 90 నిమిషాలు నిర్వహిస్తారు.
3. కేటగిరీల వారిగా అర్హత మార్కులు : జనరల్ గ్రూపు విద్యార్థులకు 40%, SC, ST విద్యార్థులకు 32% ప్రతి పేపర్లోనూ రావాలి.
దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి? పూర్తి వివరాలు:
1. ముందుగా NSP OTR నమోదు చేసుకోవాలి – National scholarship portal లో వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) నమోదు చేయాలి.
2. ఫ్రెష్ లేదా రెన్యూవల్ దరఖాస్తులను జూన్ 2 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు చేసుకోవాలి.
3. విద్యార్థుల యొక్క పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ ఫారంలో నింపి, ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులను సబ్మిట్ చేయాలి.
4. ఆదాయ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్,స్కూల్ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం వంటి పలు రకాల సర్టిఫికెట్ల వివరాలను అప్లికేషన్లో ఫిల్ అప్ చేసుకోవాలి .
ఈ scholarship కి ఉండాల్సిన అర్హతలు:
1. 7వ తరగతిలో 55 శాతం మార్కులతో పాన్సైన విద్యార్థులు. (SC /ST విద్యార్థులకు 50 శాతం మార్కులు వస్తే చాలు).
2. 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
3. విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 కంటే తక్కువ ఉండాలి.
4. KVS, NVS, సైనిక్ స్కూల్ విద్యార్థులు అర్హులు కాదు.
స్కాలర్షిప్ ఎంత చెల్లిస్తారు?:
1. NMMS స్కాలర్షిప్స్ కి రాత పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంవత్సరానికి ₹12,000/- ప్రతి సంవత్సరం చెల్లిస్తారు.
2. చెల్లింపు విధానం PFMS ద్వారా విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.
Scholarship రెన్యువల్ కి కొన్ని నిబంధనలు తప్పనిసరి? వాటి వివరాలు:
1. ఈ స్కాలర్షిప్స్ ని 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇస్తున్నందున, ప్రతి సంవత్సరపు తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
2. 9వ తరగతి నుండి పదవ తరగతికి వెళ్లేటువంటి విద్యార్థులు, ఆ తరగతిలో పాస్ అయి ఉండాలి
3. క్లాస్ 11/12 ముందు 10వ తరగతిలో కనీసం 60%, SC, ST విద్యార్థులకు 55% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ₹12,000/- స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
అంశము | తేదీలు |
NMMS నోటిఫికేషన్ విడుదల తేదీ | జూన్ 2, 2025 |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ | జూన్ 2, 2025 |
దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ | ఆగస్టు 31, 2025 |
లోపాలు సరి చేసే సమయం | సెప్టెంబర్ 15, 2025 |
విద్యార్థి యొక్క అర్హత ధ్రువీకరణ చేసే తేదీ | సెప్టెంబర్ 30, 2025 |