AP Thalliki Vandanam Scheme 2025:
ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత డబ్బులు డిపాజిట్ విషయంలో ప్రభుత్వం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. జూలై 5వ తేదీన విడుదల చేయాల్సిన రెండవ విడత డబ్బులను, జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు మొదటి తరగతిలో మరియు పదో తరగతిలో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తి అయిన తరువాత డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుని జూలై 10వ తేదీకి వాయిదా వేసింది. రెండో విడత జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 10వ తేదీన ₹13,000/- నేరుగా తల్లుల ఖాతాలో డిపాజిట్ అవుతాయి. రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
వాయిదా వెనుక అసలు కారణం ఏమిటి?: వాటి వివరాలు:
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా లబ్ధిదారుల డబ్బులను జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాయిదాకి గల ముఖ్య కారణం, పాఠశాలల్లో మొదటి తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ఇంకా కొనసాగుతున్నందున, వారికి కూడా రెండవ విడతలో తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావించినందున, ఆ అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత డబ్బులు డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే గతంలో చెప్పినట్లుగా జులై 5వ తేదీన డబ్బులు డిపాజిట్ అయ్యేవని అధికారులు చెప్తున్నారు. ఈ అడ్మిషన్స్ ప్రక్రియ మరి కొన్ని రోజుల్లో పూర్తవుతుందని అప్పుడు, రెండవ విడత జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా ₹13,000/- రూపాయలు డిపాజిట్ చేస్తామని అధికారులు తెలిపారు.
రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి?:
రెండో విడత జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించండి.
1. మొదటగా మీ మొబైల్ లోని ఏపీ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా, తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
2. రెండవ విధానంలో అధికారిక వెబ్సైట్ (Website Link) నుండి మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
3. మూడవ విధానంలో, మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్లి, అధికారులను సంప్రదించి రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదోచెక్ చేసుకోండి.
తొలి విడతలో ఎంత మంది లబ్ధిదారులకు నగదు జమ చేశారు?: వాటికీ సంబంధించిన వివరాలు:
1. తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు నగదు జమ చేశారు
2. ప్రతి విద్యార్థికి ₹13,000/- చొప్పున తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది.
3. పిల్లలను స్కూల్ కి పంపించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
రెండవ విడత జాబితా లబ్ధిదారుల డబ్బులు డిపాజిట్ కావడానికి మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అంతవరకు మీరు ఈ పథకానికి అర్హులయ్యారా లేదా అనే విషయాన్ని తెలుసుకుని, మీ బ్యాంకు ఖాతా డబ్బులు డిపాజిట్ కావడానికి సరిగ్గా పని చేస్తుందా లేదా అనేది చూసుకోండి.