Bank Of Baroda Recruitment 2025 Notification Out Apply Online: All Details In Telugu :
బ్యాంకు అఫ్ బరోడా లో స్థానిక ర్యాంక్ అధికారి రెగ్యులర్ ప్రాదిపదికన స్థానిక బ్యాంకు అధికారుల నియామకం 2500 పోస్టులకు విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ పాసై న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రం లో ఉద్యోగం వస్తుంది. వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. బ్యాంకు అఫ్ బరోడా లో స్థానిక ఆఫీసర్ నియామకానికి అర్హులైన వారు ఈ వెబ్సైటు ద్వారా అప్లై చేసుకోవచ్చు. www.bankofbaroda.in ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయి.
బ్యాంకు అఫ్ బరోడా లో స్థానిక బ్యాంకు ఆఫీసర్ నియామకం అర్హత, జీతం,వయోపరిమితి,వయస్సు మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
బ్యాంకు అఫ్ బరోడా లో ఖాళీలు ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: బ్యాంకు అఫ్ బరోడా ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు: స్థానిక బ్యాంకు ఆఫీసర్ పోస్టుల భర్తీ
వయస్సు: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ 48,480/- నుంచి రూ 85,920/-వరకు జీతం ఇస్తారు.
మొత్తం పోస్టులు: 2500
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
వెబ్సైటు : www.bankofbaroda.in లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
కావాల్సిన విద్యార్హతలు :
విద్యా అర్హతలు ( 18. 07. 2025 నాటికీ ) తప్పనిసరి గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం సంస్థ నుంచి ఏదైనా విధానం లో గ్రాడ్యుయేషన్ ( ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ తో సహా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్టం లోని స్థానిక భాష లో ( చదవడం, రాయడం,మరియు అర్థం చేసుకోవడం ) ప్రావీణ్యం కలిగి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్,కాస్ట్ అకౌంటెంట్,ఇంజనీరింగ్ లేదా మెడికల్ లో ప్రొఫెషనల్ అర్హతలు కూడా అర్హులు. తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు. అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు: UR ,OBC మరియు EWS అభ్యర్థులు రూ 850/- అండ్ మహిళలు/SC /ST /PwBD /మాజీ సైనికుల అభ్యర్థులు రూ 175/- చెల్లించాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్,ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు వాటి వివరాలు:
దరఖాస్తు ప్రారంభతేది: 04 జులై 2025
దరఖాస్తు చివరి తేదీ: 24 జులై 2025.
పరీక్షా తేదీ ఇంకా అధికారికంగా తెలియజేయలేదు. కాబట్టి ప్రతి రోజు www.bankofbaroda.in అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.