AP District Court 2025 Exams:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే నెలలో 1620 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మే 13వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఇప్పుడు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న చాలామంది అభ్యర్థులు పరీక్షల షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరీక్షలను ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం.
హైకోర్టు నుండి ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్ ఈ పరీక్షలకు సంబంధించి విడుదల కాలేదు. పరీక్షల షెడ్యూల్ ను జూన్ 15వ తేదీలలో విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహించడానికి పది రోజులు ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్ష తేదీలు, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది ఒక సారి గమనించగలరు.
ఏపీ జిల్లా కోర్టు పరీక్ష తేదీలు ఎప్పుడు?: పూర్తి వివరాలు:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు 1620 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలను ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి పరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదలకాలేదు.ఇవి అంచనా తేదీలు మాత్రమే. జూలై 15వ తేదీలోగా పరీక్షల యొక్క షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు విడుదల చేసే అవకాశం ఉంది.
హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి? వాటి వివరాలు :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క హాల్ టికెట్స్ ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1. ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లండి.
2. వెబ్సైట్ హోం పేజ్ లో ” AP District Court exams 2025 hall tickets” ఆప్షన్ ని ఎంచుకోండి.
3. అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. అభ్యర్థి యొక్క డాష్ బోర్డులో ” download hall ticket/Admit card” ఆప్షన్పై క్లిక్ చేయండి
5. మీ హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డు వెంటనే స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతుంది.
6. డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.