TS TET 2025 Exams:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 కి సంబంధించిన పరీక్షలు జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పరీక్షలు పూర్తి కావడానికి మరొక రోజే సమయం ఉంది కావున, చాలామంది పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే దానిపైన ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఫలితాలను జూలై 22వ తేదీ సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఈ పరీక్షలకు దాదాపుగా 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 18వ తేదీ నుండి రోజుకు రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది. ఒక సారి గమనించగలరు.
TS TET 2025 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?: వాటి వివరాలు:
తెలంగాణ టెట్ 2025 ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు.
1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోం పేజీలో ” TS TET 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
4. వెంటనే రిజల్ట్స్ స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి.
5. రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS TET 2025 ఫలితాల విడుదల ఎప్పుడు ఉండచ్చు? వాటి వివరాలు:
తెలంగాణ టెట్ 2025 జూన్ నెలలో జరిగిన పరీక్ష ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. మరొక రోజులో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఆన్లైన్ ఆధారిత రాత పరీక్షలు అయినందున, పరీక్ష పత్రాల మూల్యాంకనం త్వరగా పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.