SBI Jobs : గ్రామీణ బ్యాంకు లో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది.| State Bank of india circle base officer recruitment 2025

SBI CBO Circle Based Officer Notification 2025 :

బ్యాంక్ ఉద్యోగాలు కోరుకుంటున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ..మన దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI ) భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2964 ఖాళీలతో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 2,964 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (Circle Based Officer) పోస్టులను భర్తీ చేయనుంది. సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్ పోస్టులు 2600+ (బ్యాక్‌ లాగ్‌ పోస్టులు- 364) మొత్తం కలిపి 2,964 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 233 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 186 పోస్టులు ఉన్నాయి. మరోవైపు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 400 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

పోస్టులు వాటికీ సంబందించిన వివరాలు ;

మొత్తం పోస్టుల సంఖ్య : 2964

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాలు పనిలో అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు: 21 నుంచి 30 ఇయర్స్ మధ్య లో ఉండాలి.

వయోపరిమితి: 03.04.2025 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 01.05.1995 – 30.04.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు 48,480/- చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:  30.06.2025
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: జులై.
ఆన్‌లైన్‌ పరీక్ష: 2025 జులై నెలలో ఉంటుంది.
వెబ్సైటు : Go to sbi.co.in → Careers → Current Openings ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *