SSC Hindi Translator Notification 2025 :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. గత వారంలో ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా పలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (JTO), జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (JHT), జూనియర్ ట్రాన్స్‌లేటర్ (JT), సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (SHT), సీనియర్ ట్రాన్స్‌లేటర్ (ST) వంటి గ్రూప్ బీ నాన్ గేజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన SSC Hindi Translator 2025 విడుదల చేసింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( Staff Selection Commission ) ఈ నోటిఫికేషన్ ద్వారా 437 ఖాళీలను భర్తీ చేయనుంది. అయితే.. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 26 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీగా తెలియజేసారు. ఆగస్టు 12వ తేదీన సీబీటీ 1 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు, అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది . ఒక సారి గమనించగలరు.
పోస్టులు వాటికీ సంబంధించిన వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 437
పోస్టుల పేర్లు :
1. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్
2. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
3. జూనియర్ ట్రాన్స్‌లేటర్
4. సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్
5. సీనియర్ ట్రాన్స్‌లేటర్
6. సబ్ ఇన్‌స్పెక్టర్ (హిందీ ట్రాన్స్‌లేటర్)
ముఖ్య సమాచారం :
విద్యార్హతల విషయానికొస్తే.. పోస్టులను బట్టి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణత ఉండాలి. అలాగే.. డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు చదివి ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్‌లేషన్ (హిందీ/ ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. సబ్ ఇన్‌స్పెక్టర్ ట్రాన్స్‌లేటర్ (SI Translator) పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 మధ్య ఉండాలి.
SC /ST అభ్యర్థులకు 5 ఇయర్స్,
OBC అభ్యర్థులకు 3 ఇయర్స్ , దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు వివరాలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC ,ST దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.
ఎంపిక విధానం- జీతం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్/ సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.44,900- రూ.1,42,400 వరకు జీతం ఉంటుంది. ఇక ఇతర పోస్టులకు రూ.35,400- రూ.1,12,400 మధ్య వేతనం ఉంటుంది.
పరీక్ష విధానం:
పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్/ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ట్రాన్స్‌లేషన్, ఎస్సే ఇలా మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటల్లో రాయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 5, 2025
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 26, 2025
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరితేదీ: జూన్ 27, 2025
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): ఆగస్టు 12, 2025.
అధికారిక వెబ్‌సైట్: ssc.nic.in